Home Cinema BalaKrishna : ఆ కుర్ర డైరెక్టర్ కి పెద్ద వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. అలా చేసినందుకేనా..

BalaKrishna : ఆ కుర్ర డైరెక్టర్ కి పెద్ద వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. అలా చేసినందుకేనా..

BalaKrishna : సీనియర్ హీరోలలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఒక రేంజ్ ఊపులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తో కెరీర్ ముగిసే స్టేజిలో ఉన్న సమయం లో బాలయ్య కి బోయపాటి శ్రీను ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా నుండే బాలకృష్ణ గోల్డెన్ ఫేస్ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత వెంటనే ఆయన ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో చెయ్యడం(Balakrishna warns director bobby), అది ఇండియాలోనే పాపులర్ టాక్ షోస్ లో ఒకటిగా నిలవడం, బాలయ్య కి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ తీసుకొని రావడం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

director-bobby

ఇక ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి‘ చిత్రం కూడా విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో పోటీ గా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ కంటే పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు అనే విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి ని రీ ఎంట్రీ తర్వాత అభిమానులు ఎలా అయితే చూడాలని అనుకున్నారో, అదే విధంగా చూపించాడు డైరెక్టర్ బాబీ. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే బాబీ బాలయ్య బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అతి త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసాడు బాబీ. అది బాలయ్య బాబు కి పంపి చదవమనగా, ఆయనకీ ఈ స్క్రిప్ట్ లోని డైలాగ్స్ ఒక్కటి కూడా నచ్చలేదట. ఇంత చెత్త డైలాగ్స్ ఎలా రాసావు అంటూ బాబీ మీద విరుచుకుపడ్డాడట బాబీ(Balakrishna warns director bobby). బాలయ్య బాబు కి ఈ డైలాగ్స్ అన్నీ నచ్చుతాయని రాస్తే, ఆయనే ఇలా అన్నాడేంటి అనే అయోమయం లో పడ్డాడు డైరెక్టర్ బాబీ. ఇప్పుడు మళ్ళీ ఆ డైలాగ్స్ మొత్తం రీ రైట్ చేయబోతున్నాడట బాబీ.

ఇది ఇలా ఉండగా బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ‘దసరా’ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య సినిమా ‘భగవత్ కేసరి’ ఈ సినిమా రిలీజ్ కోసం ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ మరొక సినెమా కుడి చేస్తున్నారు అదే NBK 109.

కే ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు వెల్లడించాల్సి ఉంది సినిమా బృందం. సినిమా పేరును కూడా మార్చే అవకాశం ఉంది అంటారు సినీ వర్గాలలో.

Exit mobile version