Balakrishna: నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకొని మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు (Balakrishna Nara Brahmini). అయితే ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే వసుందర ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన పెళ్లి సమయం లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ కోసం ‘చైతన్య రథం’ యాత్ర లో బిజీ గా ఉన్నాడు. పెళ్ళికి కూడా ఆయన రాలేకపోయాడు. అదంతా పక్కన పెడితే బాలకృష్ణ, వసుందర దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు కొడుకు ఉన్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే.
పెద్ద కూతురు బ్రాహ్మణి మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని పెళ్లి చేసుకుంది. ఇక చిన్న కూతురు తేజస్విని గీతం విద్యాసంస్థల అధినేత భరత్ ని పెళ్లి చేసుకుంది. ఇక కొడుకు మోక్షజ్ఞ తేజ అతి త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య కి చిన్నప్పటి నుండి ఈ ముగ్గురిలో ఎక్కువగా పెద్ద కూతురు బ్రహ్మణీ అంటేనే ఎక్కువ ఇష్టం అట (Balakrishna Nara Brahmini). మొదట పుట్టిన సంతానం కాబట్టి ఆమెని ఎంతో గారాభం చేసేవాడట. బ్రాహ్మణి కి కూడా తన తండ్రి బాలయ్య అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం.
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మరియు సినీ బ్యాక్ గ్రౌండ్ ఈ రెండు ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ, ఎప్పుడూ కూడా ఈ రంగాలలో అడుగుపెట్టాలి, గొప్పగా రాణించాలి అని ఆమె అనుకోలేదు. తన మనసుకి నచ్చినట్టుగా వ్యాపార రంగం ని ఎంచుకుంది. ఇంకా ఆ రంగం లో గొప్పగా రాణించాలని ఆమె అమెరికా లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇండియా కి వచ్చాక హేరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా కొనసాగుతూ వ్యాపార రంగం లో దూసుకుపోతుంది. అంతే కాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భావం ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తనకి ఊహ తెలిసినప్పటి నుండి ప్రతీ ఏడాది బాలయ్య పుట్టిన రోజు నాడు వెయ్యి మందికి అన్నదానం చేస్తూ వస్తుందట బ్రాహ్మణి. తండ్రి మీద ప్రేమతో ఆమె చేసిన ఈ దానాల గురించి ఎప్పటికీ బయటపెట్టుకోలేదు. కేవలం తన వ్యక్తిగత విషయం గా మాత్రమే మనసులో దాచుకుంది. తండ్రి కి కూతురు మీద ఎంత ప్రేమ ఉందో,కూతురుకి తండ్రి మీద అంత మించి వంద రెట్లు ప్రేమ ఉందని ఇలాంటివి చూసినప్పుడే అర్థం అవుతూ ఉంటుంది.