Saturday, November 23, 2024
HomeCinemaBalakrishna : నందమూరి సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్ ని దారుణంగా అవమానించిన బాలయ్య.. వైరల్...

Balakrishna : నందమూరి సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్ ని దారుణంగా అవమానించిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో..

Balakrishna : నందమూరి కుటుంబం లో ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ మధ్య ఎప్పటి నుండో కోల్డ్ వార్ నడుస్తుంది అని ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ బాలయ్య బాబు తో ఎంత కలవాలని చూస్తున్నా కూడా బాలయ్య(Balakrishna Jr NTR) పట్టించుకోకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అసహనం కి గురి చేస్తుంది. అంతే కాకుండా తెలుగు దేశం పార్టీ లోకి ఎన్టీఆర్ వస్తే ఉపయోగం ఉంటుందా అని బాలయ్య ని మీడియా మిత్రులు అడిగినప్పుడు ఉపయోగం ఉండొచ్చు మరియు

balakrishna-insulted-jr-ntr-in-nandamuri-suhasini-son-marriage

ఉండకపోవచ్చు అని అప్పట్లో బాలయ్య ఇచ్చిన సమాధానం పెను దుమారమే రేపింది. ఇక రీసెంట్ గా తారకరత్న చనిపోయినప్పుడు కానీ, పెద్ద ఖర్మ జరిపినప్పుడు కానీ బాలయ్య ఎన్టీఆర్ ని ట్రీట్ చేసిన విధానం అభిమానులకు కోపం తెప్పించింది. తమ వైపు వస్తున్నా బాలయ్య కి గౌరవం ఇచ్చి పైకి లేచినప్పుడు ఎన్టీఆర్ ని పట్టించుకోకుండా పక్కకి వెళ్లిపోవడం సంచలనం గా మారింది. దీని పై సోషల్ మీడియా లో బాలయ్య మరియు ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి.

balakrishna-insulted-jr-ntr

ఇకపోతే రీసెంట్ గా హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవం కి ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తో పాటుగా బాలయ్య కుటుంబం, అలాగే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా హాజరు అయ్యింది. ముఖ్యంగా ఈ వేడుక లో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తో ఎన్టీఆర్ సరదాగా మాట్లాడుతూ కనిపించడం నందమూరి ఫ్యాన్స్ కి కనుల పండుగ లాగ అనిపించింది. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ని పెద్దగా పలకరించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు.

balakrishna

పెళ్లి కి వచ్చి కూర్చొని ఉన్న బాలయ్య కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎన్టీఆర్. అంత వరకు మాత్రమే కానీ బాలయ్య ఎన్టీఆర్ తో ఒక్కమాట కూడా మాట్లాడలేదని అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్న విషయం. బాలయ్య కి (Balakrishna Jr NTR)ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత కోపం అనేది అభిమానులకు ఇప్పటికీ కూడా అంతు చిక్కని ప్రశ్న.

వీళ్లిద్దరి కలిసి ఉంటే చూడాలని కోట్లాది మంది నందమూరి అభిమానులు ఎంతో బలంగా కోరుకుంటున్నారు, మరి వారి కోరిక భవిష్యత్తులో అయినా నిజం అవుతుందో లేదో చూడాలి. కానీ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తో ఎన్టీఆర్ ఆప్యాయంగా మాట్లాడడం మాత్రం అందరికీ బాగా నచ్చింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts