Wednesday, September 18, 2024
HomeCinemaబాలయ్య - మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మల్టీస్టార్రర్ కి ముహూర్తం సిద్ధం..

బాలయ్య – మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మల్టీస్టార్రర్ కి ముహూర్తం సిద్ధం..

ఒకప్పుడు మల్టీస్టార్రర్ సినిమాలు అంటే హీరోలు, దర్శక నిర్మాతలు భయపడేవారు. ఎందుకంటే హీరోల అభిమానుల మనోభావాలు దెబ్బ తినకుండా చేయడం చాలా కష్టం. కాబట్టి మా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసేవారు. కానీ కాలం గడిచే కొద్దీ టాలీవుడ్ లో భారీ మల్టీస్టార్రర్ చిత్రాలు వచ్చాయి. ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ నుండి ఊహించిన స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకపోవడంతో, మల్టీస్టార్రర్ ట్రెండ్ జోరు అందుకుంది. ఈ ట్రెండ్ కి ముందుగా ఆజ్యం పోసింది సూపర్ స్టార్ మహేష్ బాబు(Balakrishna Mahesh babu Multistarrer). ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం నుండి ఈ ట్రెండ్ మొదలైంది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మల్టీస్టార్రర్ చిత్రం ప్లానింగ్ లో ఉన్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఆహా మీడియా లో ప్రసారం అవుతున్న ఒక మ్యూజికల్ ప్రోగ్రాం లో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రం ఉంటుందని, ఆ సినిమా కూడా కథ కూడా నేను విన్నాను అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు, బాలయ్య బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో మహేష్ – బాలయ్య(Balakrishna Mahesh babu Multistarrer) ఇద్దరినీ ఇష్టపడే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా పడితే చూడాలి అనే కోరిక తో వీళ్లంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోంది. గతం లో వీళ్లిద్దరు అనేక సందర్భాలలో కలిశారు. ముఖ్యంగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ మొదటి సీజన్ లో మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి బాలయ్య తో సరదాగా చిట్ చాట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసేందుకు అభిమానులకు రెండు కళ్ళు సరిపోలేదు, అలాంటిది వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే ఇండస్ట్రీ లో ఒక్క రికార్డు అయినా మిగులుతుందా అని సోషల్ మీడియా లో అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉంటుంది. మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు, హీరోయిన్స్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts