Bandla Ganesh: ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలకు దూరం గా ఉంటున్నప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వివిధ అంశాల పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెటిజెన్స్ చేత తిట్లు తిన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలం లో ఈయన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన ఆరోపణలు మరియు సెటైర్లు వేస్తూ హల్చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే (Bandla Ganesh Hospitalized). అంతే కాకుండా తాను ఆరాధ్య దైవంగా భావించే పవన్ కళ్యాణ్ ఈమధ్య తనని దూరం పెట్టడాన్ని కూడా బండ్ల గణేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
కానీ పవన్ కళ్యాణ్ తనని దగ్గరకి తీసుకున్నా, దూరం పెట్టినా తన చివరి శ్వాస వరకు కళ్యాణ్ కి భక్తుడిగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ఇక పోతే రీసెంట్ గా ఆయన ట్విట్టర్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో సంచలనం గా మారింది. హాస్పిటల్ బెడ్ మీద పడుకొని సెలైన్ ఎక్కించుకుంటూ ఆయన పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియా లో సంచలనం గా మారింది (Bandla Ganesh Hospitalized). ఈ ఫోటోని చూసి అభిమానులు తెగ కంగారు పడిపోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే బండ్ల గణేష్ కి రెండు సార్లు కరోనా మహమ్మారి సోకి ఆయన ఆరోగ్యం ని చాలా తీవ్రంగా అస్వస్థతకి గురి అయ్యేలా చేసింది.
మళ్ళీ ఆయనకీ అలాంటి సమస్య ఏదైనా ఎదురైందా?, లేకపోతే ఈ ఫోటో పాతదా ? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్ కి వైరల్ ఫీవర్ సోకిందని, కాంటినెంటల్ హాస్పిటల్ లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే సంగతి ఎవరికీ కూడా తెలియదు. కానీ ఒకవేళ నిజంగానే ఆరోగ్యం బాగాలేనట్టు అయితే గెట్ వెల్ సూన్ అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ వేస్తున్నారు. మరి దీనికి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యి అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.
ప్రసుతం సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నా బండ్ల గణేష్, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పలుమార్లు తెలిపాడు. మరి ఆయన సినీ రంగం లో రాణించినట్టు గానే రాజకీయాల్లో కూడా రాణిస్తాడో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన బండ్ల, ఎవరికైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే గుర్తుకు వచ్చేది కూడా బండ్ల అన్ననే. బండ్లన్న త్వరగా కోలుకుని మల్లి మనందరినీ ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాము. అది సినిమా అయినా పర్లేదు, రాజకీయాలు అయినా పర్లేదు.