Home Cinema Sai Pallavi : ఈమె సీత పాత్రలో నటించడానికి పనికి రాదు.. బాలీవుడ్ నటుడు సంచలన...

Sai Pallavi : ఈమె సీత పాత్రలో నటించడానికి పనికి రాదు.. బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..

Sai Pallavi : దక్షిణా సినిమా ఇండస్ట్రీ మొత్తం సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని పిలుస్తుంది. ఆమె అందం, అభినయం, డ్యాన్స్ చూసి దక్షిణాదిలోని లక్షలాది మంది సినీ ప్రేమికులు ఆమెకు అభిమానులుగా మారారు. తానూ తన బాడీ ని ఎక్సపోస్ చేయకుండా ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందంటే అది మామూలు విషయం కాదు. అయితే బుల్లితెరపై లక్ష్మణుడిగా పాపులర్ అయిన సునీల్ లహరి సాయి పల్లవి ఇమేజ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దంగల్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణం చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే ఇటీవల, సెట్స్ నుండి కొన్ని చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి, ఇందులో రణబీర్ కపూర్ రాముడి గా మరియు సాయి పల్లవి సీతగా కనిపించి అందరిని మెప్పించారు. వీరిద్దరి లుక్ అభిమానులకు బాగా నచ్చింది. అయితే తాజాగా సునీల్ ఈ సినిమా క్యాస్ట్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

bollywood-actor-sunil-lahri-says-sai-pallavi-does-not-fit-in-sita-role

సునీల్ లహరి మాట్లాడుతూ, రణ్‌బీర్ లుక్స్ నాకు చాలా నచ్చాయి. ఆ తరువాత సాయి పల్లవి గురించి సునీల్ చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానులను కలవరపెడుతున్నాయి. సాయి పల్లవి గురించి సునీల్ మాట్లాడుతూ, నటిగా ఆమె ఎలా నటిస్తుందో నాకు తెలియదు.కానీ విజువల్‌గా ఆమెకు దేవతలా ఉండే గుణం లేదు. సీత ముఖం నా దృష్టిలో చాలా అందంగా మరియు పరిపూర్ణంగా ఉంటుంది. కానీ సాయి పల్లవి అంత అందంగా లేదు అనేది నా అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

Exit mobile version