Bro Review : అందరు ఎంతగానో ఎదురు చూస్తున బ్రో సినిమా నేడే విడుదలైంది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం(Bro Movie Review) మలయాళ సినిమా యొక్క రీమేక్ అయ్యిన, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా కథను మొతం తిరగరాశారు అని దర్శకుడు మరియు నటుడు సముద్ర కని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ కేతిక శర్మ మరియు వింక్ బ్యూటీ ప్రియా వర్రియర్ నటించారు. ఈ సినిమా బారి అంచనాల మధ్య విడుదలైంది.
బ్రో సినిమా లో సైడ్ పాత్రలలో నటించారు వెన్నెల కిషోర్, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమా మెగా అభిమానులకు కనులవిందు అని చెప్పుకోవచ్చు. మామ అల్లుడు కలిసి ఒకే తేరా మీద కనిపిస్తే ఆ కిక్ ఏ వేరు అంటున్నారు మెగా అభిమానులు. ఇక ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం పదండి. బ్రో సినిమా టోటల్ రన్ టైం వచ్చేసి 134 నిముషాలు. బ్రో మూవీ ఒక ఫాంటసీ చిత్రం. ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని, స్క్రీన్ప్లే త్రివిక్రమ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్.
బ్రో సినిమాను నిర్మించింది టీవీ విశ్వాప్రసాద్. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ పాత్ర పేరు మార్కండేయ. ఈ సినిమాలో ఈ పాత్ర ఎవరిని పాటించుకోకూడ తన పని తానూ చేసుకుంటూ వెళుతుంటాడు. కనీసం చెల్లి ఫీజు కట్టడానికి కూడా నిరాకరిస్తాడు. మార్క్ తాను పని చేసే కంపెనీకి జి ఎం అవాలని కోరుకుంటాడు. ఒకరోజు ఆఫీసుకు వెళ్లేప్పుడు మార్క్ కు ఆక్సిడెంట్ అవుతుంది మరియు అక్కడికక్కడే మరణిస్తాడు.
ఆయన ఆత్మా అనంతలోకానికి వెళ్లక అక్కడ బ్రో అనే దేవుడిని కలిసి అతనికి తన బాదంతా చెప్పుకొని ఒక 90 రోజుల పాటు నను మల్లి భూమి మీదికి పంపియమని వేడుకుంటాడు. తనకు చెల్లి ఉందని, అమ్మకు కూడా ఆరోగ్యం బాలేదు నేను భూమిపైకి వెళ్లి అని పనులు చేసుకొని వస్తా నాకు ఆ అభయం ఇవ్వమని కోరుకుంటాడు మార్క్. బ్రో దేవుడు కనికరించి మార్క్ ను ఓ 90 రోజుల పాటు భూమి మీదికి పంపిస్తాడు. ఇలా మార్క్ భూమి పైకి వచ్చాక ఇంకా ఎన్నో కష్టాలు ఎదురుకుంటాడు.
ఆయన చేసే జాబ్ పోతది, అమ్మ ఆరోగ్యం మరింత క్షిణిస్తుంది అప్పుడు మార్క్ 90 రోజులలో తానూ పూర్తి చేయాలిసిన పనులు అన్ని కష్టం అవుతాయి మరియు తన చేయి జారిపోయేటపుడు బ్రో దేవుడు పవన్ కళ్యాణ్ తనకు ఎలా హెల్ప్ చేసి తన కష్టాల నుండి ఎలా బయటకు తీసుకొస్తాడు అనేది ఈ స్టోరీ. ఈ సినిమాలో పవన్ మేనియా చూస్తాము. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున స్టైల్ లో ఆయన వెండితెరపై కనిపించారు.
కని ఈ స్టోరీ కు ఇంట బడ్జెట్ పెటాలిసిన అవసరం లేదు మరియు పారితోషికాలు ఎక్కువ ఖర్చు పెట్టేసారు అనిపించేలా ఈ సినిమా ఉంది. ఈ సినిమాను ఇంకా మంచిగా తీయొచ్చు అని చెప్పుకోవచ్చు. మేము ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 2 / 5 (Bro Movie Review).