Chiranjeevi: ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరితో స్నేహం గా మెలగడం మెగాస్టార్ చిరంజీవి స్వభావం. ఏ ఒక్కరిని కూడా నొప్పించేలా మాట్లాడడం ఆయనకీ చేత కాదు. తనకి హాని తలపెట్టిన వాళ్ళని కూడా క్షమించి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేంత గోప్ప మనస్సు ఉన్న వ్యక్తిగా చిరంజీవి కి ఇండస్ట్రీ లో ఎంతో గొప్ప పేరుంది. అయితే తనకి ఎంత హాని తలపెట్టినా ఊరుకుంటాడు కానీ, తన కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం చిరంజీవి అసలు సహించడు, ఎంత దూరమైనా వెళ్తాడు(Chiranjeevi Scolds). ముఖ్యంగా ఆయనకీ కొడుకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
తన కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు తననే మించిపోయే రేంజ్ కి వెళ్లిపోయాడని ఎప్పటికప్పుడు పబ్లిక్ స్టేజి మీద చెప్పుకుంటూ మురిసిపోయేవారు మెగాస్టార్. అలాంటి కొడుకు ని తప్పు దోవ పట్టించేలాగా చేదు వ్యసనాలకు బానిసని చెయ్యాలని చూస్తే మెగాస్టార్ చూస్తూ ఊరుకుంటాడా? తాట తీసేసాడు కదా! అదే జరిగింది. అసలు విషయం లోకి వెళ్తే అప్పట్లో రామ్ చరణ్ ఒక ప్రముఖ స్టార్ హీరో కొడుకు తో చాలా స్నేహం గా ఉండేవాడు. అతనితోనే కలిసి తిరుగుతూ, పార్టీలకు పబ్బులకు తెగ వెళ్ళేవాడు. చిరంజీవి అప్పట్లో ఎంజాయ్ చేసే వయస్సు కదా, అందులో తప్పేమి ఉంది, ఎంజాయ్ చెయ్యనివ్వండి అని అనుకునేవాడట.
కానీ చరణ్ కి లేని పోనీ చెడు అలవాట్లు మొత్తం నేర్పించే ప్రయత్నం ఆ స్టార్ హీరో కొడుకు చేసాడనే విషయం చిరంజీవి కి తెలిసింది. సిగరెట్లు, మందు తాగడమే కాకుండా, వినడానికి కూడా అసహ్యించుకునే చెడు అలవాటు కొన్ని రామ్ చరణ్ కి నేర్పించే ప్రయత్నం చేసాడట. ఇది తెలుసుకున్న చిరంజీవి, నేరుగా ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి ‘చిన్న వయస్సులోనే నువ్వు పూర్తిగా చెడిపోవడమే కాకుండా, మా చరణ్ బాబు ని కూడా చెడగొట్టాలని చూస్తావా? జాగ్రత్తగా ఉండూ, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు(Chiranjeevi Scolds), చరణ్ కి దూరం గా ఉండు, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు’ అని వార్నింగ్ ఇచ్చాడట మెగాస్టార్.
ఈ విషయం తెలుసుకున్న ఆ కుర్రాడి తండ్రి (స్టార్ హీరో) చిరంజీవి ఇంటికి తిరిగి వెళ్లిపోయిన తర్వాత, కొడుకుని లోపలకు తీసుకెళ్లి చితక బాదాడు అట, అప్పటి నుండి రామ్ చరణ్ కి ఆ కుర్రాడికి మాటలు లేవు. ప్రస్తుతం ఆ కుర్రాడు విదేశాలలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వసిస్ట్ తో కలిసి తన 157వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏప్రిల్ లో మొదలు అయ్యే అవకాశం ఉంది.
అంతే కాకుండా చిరు డైరెక్టర్ పూరి జగన్నాద్ తో కూడా కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు, ఆ సినిమా పేరే ఆటో జిని. ఈ సినిమా కాస్ట్ ఎవరు ఏంటి అనేవాటిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.