Home Cinema Chiranjeevi : ఆ ఆంటీ తో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధపడ్డ చిరంజీవి..

Chiranjeevi : ఆ ఆంటీ తో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధపడ్డ చిరంజీవి..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కి ఇప్పుడు అర్జెంటు గా భారీ హిట్ కావాలి. ఎలాంటి హిట్ అంటే ఇండియా మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా ఆయన నుండి వచ్చిన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టి 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన మెగాస్టార్ కి, ద్వితీయార్థం లో ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ రావడం అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసింది(Chiranjeevi Anushka Shetty). ఈ సినిమా కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

anushka-shetty-mrunal-thakur-aishwarya-rai

కానీ ఓటీటీ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. ఈ చిత్రానికి ఒక్క సక్సెస్ కూడా లేని మెహర్ రమేష్ డైరెక్టర్ అవ్వడమే పెద్ద శాపం అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ ప్రస్తుతం ‘భింబిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కబోతుంది. చిరంజీవి ఈ చిత్రం లో తన కూతురు కోసం మూడు లోకాలు ప్రయాణం చేస్తాడు. చాలా భిన్నమైన కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

చిరంజీవి పుట్టినరోజు నాడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలిసింది. వారిలో ఇద్దరు అనుష్క శెట్టి మరియు మృణాల్ ఠాకూర్ కాగా, మరొక హీరోయిన్ ఐశ్వర్య రాయి అని తెలుస్తుంది(Chiranjeevi Anushka Shetty). చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్య రాయి, రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చింది. పొన్నియన్ సెల్వన్ లో అద్భుతంగా నటించింది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఆమె చెయ్యబొయ్యే సినిమాలో ఇప్పటి వరకు పోషించని పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది అట.

ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని, ప్రస్తుతం ఆమెతో కథా చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అధికారికంగా ఖరారు అవుతుందని అంటున్నారు. ఇక చిరంజీవికి ఇది చాలా ముఖ్యమైన సినిమా కాబోతుంది, ఎందుకంటే భోళా శంకర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే తొలగని మచ్చ. అలాంటి సినిమా గాని ఇంకోటి చిరు కాతాలో పడితే ఇంక చిరంజీవి రెండో ఇన్నింగ్స్ కూడా ముగింపుకు వచ్చినట్టే.

ఇక అనుష్క ఏమో తన రీసెంట్ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ని ఆస్వాదిస్తోంది. అనుష్క ఇపుడు ఒక మలయాళం సినిమాలో విల్లన్ పాత్రలో నటించబోతుంది. మరి ఫాన్స్ ఈ యాంగిల్ ని ఎలా తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Exit mobile version