Home Cinema Ram Charan : ఒకే స్క్రీన్ పై కనిపించనున్న మహేష్ – రామ్ చరణ్.. అభిమానులు...

Ram Charan : ఒకే స్క్రీన్ పై కనిపించనున్న మహేష్ – రామ్ చరణ్.. అభిమానులు పండగ చేసుకునే న్యూస్..

Ram Charan : సౌత్ స్టేట్స్ లోని సినిమా ప్రేమికులు అందరు ఈ న్యూస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమే అని ఫిక్స్ అయ్యారు. మహేష్ బాబు మరియు రామ్ చరణ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప స్టార్ హీరోలో ప్రత్యేకంగా(Ram Charan Mahesh Babu) చెప్పనవసరం లేదు. వీరిద్దరికు కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉంది. వీరి సినిమా వస్తుందంటే చాలు అదొక పండగలా సెలెబ్రేట్ చేసుకుంటారు వీరి అభిమానులు.

mahesh-babu-ram-charan-at-nageshwara-rao-statue-inauguration-function

వీరిద్దర ఎప్పుడు ఎవరి పనిలో వారు బిజీ బిజీగా ఉండడం వాళ్ళ వీరిని ఒకే ఫ్రేమ్ లో చూడడం మహా కష్టం. అయితే ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు రామ్ చరణ్ మరియు మహేష్ బాబు హాజరయ్యారు. ఈ ఇద్దరు స్టార్ నటులు అక్కినేని నాగార్జునకు చాలా సన్నిహితులే. ఇది మనం చాలా సార్లు చూసాం. ఇలా ఈ విగ్రహ వేడుకలలో ఈ ఇద్దరు స్టార్ నటులు కెమెరాకు కలిసి ఫోజులు ఇచ్చారు. ఇప్పటివరకు వీరిద్దరూ ఒకే ఫంక్షన్ కు రావడం కూడా మనం చూడలేదు.

ఇదే మొదటిసారి అవడంతో అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్టు చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజనులు అయితే వీరిద్దరి ఇలా ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే, వెండితెరపై కూడా కొద్దీ రోజులలో కలిసి కనిపీయనున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇది జరిగితే మాత్రం మెగా మరియు ఘట్టమనేని అభిమానులతో సహా అందరు సినిమాల ప్రజలు పండగ చేసుకుంటారు. రామ్ చరణ్, మహేష్ – నమ్రతతో కలిసి ఫోటోలు కూడా దిగారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరక్కేక్కిస్తున్నా గేమ్ ఛంజెర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మరో వైపు మహేష్ బాబు(Ram Charan Mahesh Babu) ప్రస్తుతం మాటల మాంత్రికుడు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.

సినిమా తరువాత మహేష్ రాజమౌళి తో కలిసి సినిమా షూటింగ్ లో పలుగొంటారు. అయితే ఇటీవల వీరిద్దరిని ఒకే ఫంక్షన్ లో చూసిన కొందరు, మహేష్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమాలో రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ న్యూస్ నిజమయితే సినిమా ప్రజలకు పండగే.

Exit mobile version