Dhanush Rajinikanth: రీసెంట్ సమయం లో పెళ్లి వార్తలకంటే ఎక్కువగా విడాకుల వార్తలను మనం ఎక్కువగా వింటున్నాము. కొత్తగా పెళ్ళైన జంటల మధ్య గొడవలు వచ్చి విడిపోయిన ఒక అర్థం ఉంటుంది. కానీ ఎన్నో ఏళ్ళ నుండి దాంపత్య జీవితం కొనసాగిస్తున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటూ సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారో అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలా ఎన్నో ఏళ్ళు కాపురం చేసి విడిపోయిన జంటలలో ఒకటి ధనుష్ – ఐశ్వర్య జంట. రజినీకాంత్ చిన్న కూతురుని ప్రేమించి పెళ్లాడిన ధనుష్, ఆ తర్వాత కొన్నాళ్ళు కాపురం చేసి పిల్లల్ని కని సంసారం జీవితాన్ని ఎంతో సజావుగా సాగించాడు(Dhanush Rajinikanth). అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈమధ్యనే ఈయన విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న రోజు నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియా లో ధనుష్ పై నెగటివిటీ ఏర్పడిన సంగతి మన అందరికీ తెలిసిందే.
అయితే ధనుష్ రీసెంట్ గా వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఇట్స్ జైలర్ వీక్’ అంటూ వేసిన ఒక ట్వీట్ కి భారీ స్థాయిలో లైక్స్ మరియు రీట్వీట్స్ పడ్డాయి. దీనిని బట్టి మామ అల్లుడి గా ఇద్దరు దూరం అయ్యినప్పటికీ , ఒక అభిమానిగా మాత్రం ధనుష్ ఇప్పటికీ రజినీకాంత్ ని ఆరాధిస్తున్నదని అర్థం అవుతుంది. రజినీకాంత్ కూడా ధనుష్ ని ఇప్పటికీ తన సొంత అల్లుడిగానే భావిస్తున్నాడట. విడాకులు రద్దు చేసుకోమని అనేకసార్లు రిక్వెస్ట్ చేసాడట రజినీకాంత్. కొంత కాలం ఇలాగే ఉండనివ్వండి మామయ్య అంటూ ధనుష్ అన్నాడట.
అంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ధనుష్ తన విడాకులుని రద్దు చేసుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే రజినీకాంత్ హీరో గా నటించిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. మొదటి రోజే 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుందని అంటున్నారు. ఇక తెలుగు లో కూడా ఈ చిత్రం 40 కోట్ల రూపాయిల షేర్ ని అందుకుంటుంది అని అనుకుంటున్నారు, చూడాలి మరి.