Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీ నుండి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో అక్కినేని అఖిల్. నాగార్జున రెండవ కొడుకు గా వచ్చిన అఖిల్ కి మొదటి సినిమా నుండే మంచి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ హీరో కి ఏమాత్రం తీసిపోనీ విధంగా ఉండే అఖిల్ టాలీవుడ్ కి సరికొత్త సూపర్ స్టార్ అవుతాడని అందరూ అనుకున్నారు(Akhil Akkineni Slap Amala). కానీ ఇప్పటి వరకు ఆయనకీ ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడం విశేషం. అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సోదరుడు నాగ చైతన్య 8 సూపర్ హిట్ సినిమాలను చేసాడు.
కానీ అఖిల్ ఒక్క సూపర్ హిట్ కూడా ఇవ్వలేకున్నాడు. ఇక ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఆయన ‘యోధా’ అని చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే అఖిల్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కొంతకాలం క్రితం నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో చెప్తాడు. అఖిల్ సినిమాల విషయం లో నా సలహాలు తీసుకోవడం కంటే వాళ్ళ అమ్మ సలహాలు తీసుకోవడానికే ఇష్టపడతాడు.
నేను మొదటి నుండి వాడికి సినిమాల విషయం లో ఎలాంటి సలహాలు ఇవ్వను, వాడు కూడా నన్ను అడగడు, కానీ అమల ని మాత్రం అడుగుతాడు. వాడికి నాతో కంటే ఎక్కువగా అమల తోనే మంచి రిలేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ వేరు, తల్లి కొడుకులు లాగ కాకుండా ఒక మంచి స్నేహితులు లాగ ఉంటారు. అప్పుడప్పుడు అఖిల్ కి వాళ్ళ ఆమ్మ మీద చిరాకు వచ్చి అరుస్తుంటాడు, ఆమె కూడా అరుస్తుంది(Akhil Akkineni Slap Amala). కానీ సాయంత్రానికి నేను షూటింగ్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసిపోయి ఉంటారు. నాతో కూడా స్నేహం గానే ఉంటాడు కానీ, కాస్త భయం, గౌరవం ఉంటుంది అని చెప్పుకొచ్చాడు నాగార్జున.
ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఏజెంట్ సినిమా ప్లాప్ అప్పుడు అఖిల్ చాలా కృంగిపోయాడు. ఆ సమయం లో అమల చాలా సపోర్ట్ గా నిలిచింది అట. అఖిల్ ఏజెంట్ సినిమా ని 2023 లో అతి పెద్ద ప్లాప్ గా అనొచ్చు. ఈ సినెమా తీసిన ప్రొడ్యూసర్ చిప్పకూడు తింటున్నాడు అనే చెప్పాలి. సినిమా కి 70 కోట్లు ఖర్చు కాగా, తనకి తిరిగి వచ్చింది మాత్రం 30 కోట్లే.
దేంతో ప్రొడ్యూసర్ అమెరికా లో తన కున్న కొన్ని స్థులను అమ్ముకోవల్సివచ్చింది. ఇక అఖిల్ తో సినిమా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అందరూ ప్రొడ్యూసర్ లకి తెలిసిపోయింది. ఇకనైనా అఖిల్ తన మంచి స్టోరీ ఉన్న సినిమా లు ఎంపిక చేసుకోవాలి. లేకాపోతే ఇండస్ట్రీ లో రానివ్వటం కష్టమే.