Kajal Agarwal Husband Affair : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందాల ఆరబోతతో పాటుగా అద్భుతమైన అభినయం కూడా కలిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘లక్ష్మి కళ్యాణం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ లో మాత్రం అవకాశాలకు కొదవే లేకుండా వచ్చాయి. ఆ సినిమా తర్వాత వచ్చిన చందమామ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించడం , ఆ తర్వాత ‘మగధీర’ చిత్రం చెయ్యడం, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకపోవడం వంటివి జరిగాయి.
చూస్తూ ఉండగానే కాజల్ అగర్వాల్ మీడియం రేంజ్ హీరోయిన్ నుండి, సౌత్ లోనే నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ పీక్ రేంజ్ లోకి వచ్చిన తర్వాత ఆమె తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచులు అనే అతనిని ప్రేమించి పెళ్ళాడి, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి, ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలయ్య బాబు తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే కాజల్ అగర్వాల్ భర్త గురించి ఇన్ని రోజులు ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేమిటంటే గౌతమ్ కిచులు ఇండస్ట్రీ లో కాజల్ అగర్వాల్ కి ముందు ఒక టాప్ మోస్ట్ హీరోయిన్ ని ఘాడం గా ప్రేమించాడట(Kajal Agarwal Husband Affair). ఆర్థికంగా వేలకోట్ల రూపాయలకు అధిపతి అయినా గౌతమ్ కిచులు ని డబ్బు పరంగా ఆ హీరోయిన్ బాగా వాడుకొని వదిలేసింది అట. ఆ సమయం లో డిప్రెషన్ లోకి వెళ్లిన గౌతమ్ కి కాజల్ అగర్వాల్ అండగా నిలబడింది అట. అతని కష్టసుఖాలు పంచుకుంటూ మెల్లగా ఇద్దరి మనసులు ఒకటై పెళ్లి చేసుకున్నారని అంటున్నారు.
ఇప్పుడు ఈ క్యూట్ జంట కి ఒక బాబు కూడా పుట్టాడు, పలు సార్లు ఆ బాబు ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది కాజల్ అగర్వాల్. ఇక ఆమె భర్త గౌతమ్ గురించి తెలుసుకున్న ఈ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భగవత్ కేసరి అనే సినిమాలో నటిస్తుంది. ఆగస్టులో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి మెహెర్ రమేష్ దర్శకత్వం వహించాడు.