Priyadarshi : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు కమెడియన్ గా మంచి గుర్తింపుని దక్కించుకున్న ప్రియదర్శి, రీసెంట్ గా ‘బలగం’ చిత్రం తో హీరో గా కూడా సక్సెస్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కమెడియన్(Priyadarshi Latest) గా ఎంత వినోదం ని పంచగలడో, అలాగే సెంటిమెంట్ ని కూడా పంచలడు అని అనేక సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. అందుకే ప్రియదర్శి ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ కమెడియన్ రేంజ్ కి ఎదిగాడు.
‘బలగం‘ చిత్రం తో హీరో గా సక్సెస్ అందుకున్న ప్రియదర్శి మళ్ళీ హీరో గా నటిస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ. ఒకవేళ చేస్తే మాత్రం సక్సెస్ అవుతాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక సినిమాలో హీరో గా చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటే కచ్చితంగా ఆ చిత్రం లో విషయం ఉంటుంది అనే ముద్ర ప్రేక్షకుల్లో పడింది. గతం లో ఆయన హీరో గా నటించిన ‘మల్లేశం’ చిత్రం కూడా ఇలాంటి ప్రేక్షాధారణే దక్కించుకుంది.
పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు కెరీర్ ని ప్రారంభించిన ప్రియదర్శి. ఆ తర్వాత ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తూ 50 చిత్రాల్లో నటించాడు. అయితే ఈ ఏడాదిలో మాత్రం కేవలం బలగం అనే సినిమా తప్ప మరో చిత్రం లో కనిపించలేదు. ఇకపోతే సినిమాల్లో కనిపించకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఎల్లపుడూ యాక్టీవ్ గా ఉంటాడు ప్రియా దర్శి. రీసెంట్ గా ఆయన తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో తెగ వైరల్ గా మారింది.
షర్ట్ లేకుండా నడుము సైడ్ భాగం లో తగిలిన దెబ్బని చూపిస్తూ ఒక ఫోటోని అప్లోడ్ చేసాడు. ఈ ఫోటో క్రింద కామెంట్స్ ని ఒక్కసారి చూస్తే నవ్వుకుంటారు. కొంతమంది నెటిజెన్స్ ఏమైంది భయ్యా నీ రెండు కిడ్నీ లను దానం చేసేసావా అంటూ సెటైర్స్ వేశారు. మరి కొంత మంది అయితే షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యిందా భయ్యా, జాగ్రత్తగా ఉండు అంటూ కామెంట్స్ చేసారు.
ఎక్కువగా డబ్బులు లేక కిడ్నీలు అమ్మేశావా ఏమిటి అంటూ చేసిన కామెంట్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఈ కామెంట్స్ ఇప్పుడుస్ ఉష మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది. మరి ప్రియతదర్శి(Priyadarshi Latest) దీనికి ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.