Ramya Krishna Rajinikanth Affair: సౌత్ ఇండియా లో స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజి ఉన్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ఈ హీరోయిన్స్ కేవలం హీరోల పక్కన డ్యాన్స్ వెయ్యడం, రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే నటించే హీరోయిన్స్ కాదు, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించే అరుదైన హీరోయిన్స్. అందుకే జనరేషన్స్ మారుతున్నా కూడా ఎప్పటికీ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్స్ గా కొనసాగుతూ, నేటి తరం స్టార్ హీరోయిన్స్ తో సరిసమానంగా రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ.
ఈమె రొమాంటిక్ గా నటించగలదు, అందాలను ఆరబొయ్యగలదు, విలన్ రోల్స్ అద్భుతంగా చెయ్యగలదు, సెంటిమెంట్ రోల్స్ కూడా చెయ్యగలదు. వీటి అన్నిటికి మించి అమ్మవారి పాత్రలకు పెట్టింది పేరు లాంటిది రమ్య కృష్ణ గారు. బాహుబలి సినిమాతో తన యాక్టింగ్ టాలెంట్ ని ఇండియా మొత్తానికి తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె ఒక్కో రోజుకి 10 లక్షల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత కాలం దూరం అయ్యింది.
ఆ తర్వాత కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి కెరీర్ పీక్ రేంజ్ ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తుంది. ఇకపోతే కృష్ణ వంశీ తో పెళ్లి కాకముందు రమ్య కృష్ణ పలువురి హీరోస్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. హలో బ్రదర్ సినిమా సమయం లో అక్కినేని నాగార్జున తో, అలాగే ‘నరసింహా’ సినిమా సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో రమ్య కృష్ణ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి(Ramya Krishna Rajinikanth Affair). వాటిల్లో ఎంత మాత్రం నిజం ఉందో లేదో తెలియదు కానీ, రమ్య కృష్ణ మాత్రం ఈ ఇద్దరి హీరోలతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటుంది.
ఇకపోతే రమ్యకృష్ణ తన భర్త కి దూరం గా కొడుకు తో కలిసి వేరే ఇంట్లో ఉంటుందని, వీళ్లిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్నీ కృష్ణవంశీ ని అడగగా, ఆయన నవ్వుతూ కొట్టిపారేశాడు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘రంగబలి’ చిత్రం లో కూడా రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషించింది. అలా మేమిద్దరం కలిసే ఉన్నాము అంటూ ఈ జంట ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. రమ్య కృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అత్తగా నటిస్తుంది. ఈ విషయం దేవర సినిమా బృందం ఏ స్వయంగా ప్రకటించారు.