Friday, November 22, 2024
HomeCinemaSinger Sunitha: ఆ డైరెక్టర్ తో సింగర్ సునీత ఎఫైర్..? అందుకే మొదటి భర్త విడాకులు..

Singer Sunitha: ఆ డైరెక్టర్ తో సింగర్ సునీత ఎఫైర్..? అందుకే మొదటి భర్త విడాకులు..

Singer Sunitha: ఇండస్ట్రీ లో ఎంతమంది సింగర్స్ ఉన్నప్పటికి ఆడియన్స్ గుర్తు పెట్టుకునేది కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే. ఆ ఇద్దరు ముగ్గురిలో ఒకరు సునీత. రామ్ గోపాల్ వర్మ నిర్మాణం లో కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘గులాబీ’ చిత్రం లో ‘అసలేం గుర్తుకురాదు, నా కన్నుల ముందు నువ్వు ఉండగా’ అనే పాత ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ పాట ఆరోజుల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మెలోడీ లవర్స్ ఇప్పటికీ ఆ పాటని వింటూనే ఉంటారు. ఆ పాట తర్వాత సుమారుగా 10 వేలకు పైగా పాటలను పాడిన సునీత ఇండస్ట్రీ లోనే టాప్ 5 సింగర్స్ లో ఒకరిగా కొనసాగింది.

sunitha-v-n-aditya

ఇప్పటికీ కూడా ఈమె పాటలు పాడుతూ బిజీ గానే గడుపుతుంది. కొన్ని సింగింగ్ షోస్ కి జడ్జీ గా కూడా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉండగా సునీత(Singer Sunitha) గురించి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక వార్త తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే సునీత గతం లో కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల పాటు సంసారం సాగించిన ఈ దంపతులు కొన్ని అనుకొని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వీళ్లిద్దరు కూడా ఇప్పుడు పెళ్ళికి ఎదిగి ఉన్నారు.

sunitha

అయితే సునీత, కిరణ్ మధ్య ఏర్పడిన కొన్ని అపోహల కారణంగా విడిపోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్. ఆ తర్వాత సునీత మాంగో మ్యూజిక్ అధినేత రామ్ ని రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ఎదిగిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో వ్యతిరేకత ఏర్పడింది. కానీ సునీత పిల్లలే పట్టుబట్టి ఆమెకి పెళ్లి చేసారని స్వయంగా సునీత ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా సునీత తన మొదటి భర్త తో విడాకులు తీసుకోవడానికి కారణం ఒక స్టార్ డైరెక్టర్ అని తెలుస్తుంది.

singer-sunitha

అసలు విషయం లోకి వెళ్తే ‘మనసంతా నువ్వే’ మూవీ డైరెక్టర్ వీ యెన్ ఆదిత్య తో సునీత అప్పట్లో చాలా సన్నిహితంగా ఉండేది. వీళ్లిద్దరు సన్నిహితంగా ఉండడం చూసి చాలా మంది వీళ్ళ మధ్య ఎదో జరుగుతుంది అనుకున్నారు. కిరణ్ కూడా అలాగే అనుకోవడం వల్ల, ప్రతీ రోజు సునీత – కిరణ్ మధ్య గొడవలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సింగర్ సునీత కొడుకు సినిమాలో హీరోగా రానున్నాడు. మొన్న షూటింగ్ పూర్తయిన ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts