Ravi Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో మాస్ మహారాజ రవితేజ పేరు కచ్చితంగా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత చిన్న చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారా వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంటూ హీరో గా మారి హిట్టు మీద హిట్ కొడుతూ నేడు మాస్ మహారాజగా ఎదిగాడు. అయితే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో చాలా మంది స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పని చేసాడు.
కృష్ణ వంశీ, రాఘవేంద్ర రావు, ఈవీవీ సత్యనారాయణ ఇలా ఎంతో మంది లెజెండ్స్ దగ్గర ఆయన అసిస్టెంట్ గా పని చేసారు. అయితే ఈయన పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజి రేంజ్ లో ఆడినప్పటికీ పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టింది.
అయితే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రవితేజ పని చేసాడట. ఈవీవీ సత్యనారాయణ ఎప్పుడైనా షూటింగ్ కి రాని సమయం లో రవితేజనే అన్నీ దగ్గరుండి చూసుకునేవాడట. చాలా సన్నివేశాలకు ఆయన దర్శకత్వం కూడా వహించాడు . అయితే ఈ సినిమా చివరి షెడ్యూల్ కి ముందు రవితేజ కి సినిమాల్లో అవకాశాలు భారీ గా రావడం తో అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ బై చెప్పేసి సంపూర్ణంగా నటన మీదనే ద్రుష్టి పెట్టాడట. ఇక ఆ తర్వాత రవితేజ రేంజ్ ఎక్కడి దాకా వెళ్లిందో ప్రతీ ఒక్కరు చూస్తూనే ఉన్నాం. నేడు ఆయన సినిమాకి హిట్ టాక్ వస్తే చిన్న పిల్లల దగ్గర నుండి, ముసలి వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు క్యూ కడుతారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం అనేది సాధారణమైన విషయం కాదు. రీసెంట్ గానే ఆయన ధమాకా , వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల రూపాయిలను కొల్లగొట్టాడు. రాబొయ్యే రోజులలో ఇంకెన్ని విజయాలు అందుకుంటాడో చూడాలి. రవితేజ(Ravi Teja) ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి టైగర్ నాగేశ్వర్ రావు మరొకటి ఈగల్. ఈగల్ సినిమా 2024 లో రిలీజ్ అవ్వబోతుంది.