Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ప్రారంభం నుండి ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయం కృషి తో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభం లో నెట్టుకొచ్చిన చిరంజీవి అలాంటి రోజుల్లోనే ఈ కుర్రాడు భవిష్యత్తు లో పెద్ద స్టార్ అవుతాడు అని అప్పటి లెజెండ్స్ అందరికీ అనిపించాడు. అలాంటి లెజెండ్స్ లో అల్లు రామలింగయ్య కూడా ఒకడు(Chiranjeevi Marriage). అప్పట్లో చిరంజీవి లోని స్పార్క్, టాలెంట్ ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. అంతే కాదు చిరంజీవి తో కలిసి పని చేసేటప్పుడు అతని గుణ గనాలు, అలవాట్లు అన్నీ తెలుసుకున్నాడు.
కుర్రాడు చాలా మంచి వాడు అని అర్థం అయ్యాక తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసాడు(Chiranjeevi Marriage). చిరంజీవి స్టార్ అయ్యాక అల్లు ఫ్యామిలీ రేంజ్ ఇంకా తారా స్థాయికి వెళ్ళింది. అల్లు అరవింద్ ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ నిర్మాత అయ్యాడు. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి పెళ్లి సమయం లో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే సురేఖ గారితో పెళ్లి సమయం లోనే చిరంజీవి మంచి బిజీ ఆర్టిస్ట్. ఆయన ఒక్కరోజు కాల్ షీట్ దొరకడమే చాలా కష్టం, సరిగ్గా అలాంటి సమయం లోనే ఆయనకీ పెళ్లి కుదిరింది, పెళ్లి రోజే ఆయనకి షూటింగ్ ఉంది.
ఆరోజు ‘తాతయ్య గారి లీలలు ‘అనే షూటింగ్ లో ఉన్నాడు. ఆరోజు చిరంజీవి కి సెలవు కచ్చితంగా కావాలి, కానీ అదే రోజు మరో బిజీ ఆర్టిస్ట్ నూతన ప్రసాద్ తో చిరంజీవి కాంబినేషన్ సన్నివేశలు కూడా ఆరోజే ప్లాన్ చేసారు. నూతన ప్రసాద్ డేట్ ఒక్క రోజు మిస్ అయినా నెల రోజులు మళ్ళీ దొరకదు, అందుకే నిర్మాత చిరంజీవి ని వదలడానికి ఒప్పుకోలేదు, కానీ అల్లు అరవింద్ పట్టుబట్టాడు. అప్పుడు చిరంజీవి కోసం నిర్మాత పెళ్లి మండపం కి దగ్గరగా షూటింగ్ ని ప్లాన్ చేసాడు. చిరంజీవి షూటింగ్ లొకేషన్ లో వేసుకున్న చొక్కా తోనే పెళ్ళికి వచ్చాడు. పాపం ఆయన చొక్కా మొత్తం చిరిగిపోయింది, అలా చిరిగినా చొక్కాతోనే పెళ్లి చేసుకున్నాడట.
అలా నూతన ప్రసాద్ డేట్ కోసం చిరంజీవి ఇంత రిస్క్ లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిర్మాత కాస్త ఆ మాత్రం సహకరించి ఉండకపొయ్యుంటే ఆరోజు చిరంజీవి పెళ్లి క్యాన్సిల్ అయ్యేది అట. చిరంజీవి ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్నాడు, తన లాస్ట్ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వటంతో మొఖం ఎక్కడ పెట్టుకోవాలి తేలిక చిరంజీవి అమెరికా వెళ్ళాడు అని కొందరు ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.
భోళా శంకర్ సినిమా తో భారీ లాస్ లోకి వెళ్ళిపోయాడు నిర్మాత. ఈ ఏడాదే 100 కోట్లకు పైగా నష్టపోయాడు అనిల్ సుంకర. ఏంటి 100 కోట్లు ఎలా అని అనుకుంటున్నారు ? ఈ ఏడాది అతి పెద్ద డిసాస్టర్ సినిమాలు అఖిల్ నటించిన ఏజెంట్, చిరాంజీవి భోళా శంకర్ రెండు సినిమాలు నిర్మించింది అనిల్ సుంకరే.