Dil Raju-Allu Arvind: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ స్థాయి నిర్మాతలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో దిల్ రాజు మరియు అల్లు అరవింద్ పేర్లు టాప్ 2 స్థానాల్లో ఉంటాయి. తెలుగు, హిందీ మరియు తమిళం బాషలలో ఈ ఇద్దరి నిర్మాతలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి (Dil Raju Allu Arvind). తెలుగు లో అయితే దిల్ రాజు దాదాపుగా నేటి తరం స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేసాడు. ఇక అల్లు అరవింద్ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు కానీ, నేటి తరం స్టార్ హీరోలలో మెగా కాంపౌండ్ హీరోలను దాటి ఆయన ఇతర హీరోలతో సినిమాలు చెయ్యలేదు.
ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లో టాప్ స్థానాల్లో ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉన్నాయని రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది. ఇలా వీళ్లిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం ప్రముఖ డైరెక్టర్ పరశురామ్. పరశురామ్ తో గతం లో అల్లు అరవీంద్ విజయ్ దేవరకొండ ని హీరో గా పెట్టి ‘గీత గోవిందం’ అనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించాడు (Dil Raju Allu Arvind). ఈ సినిమా తర్వాత పరశురామ్ గీత ఆర్ట్స్ లో మరో సినిమా చెయ్యాలి. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చెయ్యాలని ఎప్పుడో ఒపందం కుదరించుకున్నారు.
అయితే ఆ ఒప్పందం ని తుంగలో తొక్కుతూ డైరెక్టర్ పరశురామ్ దిల్ రాజు క్యాంపులోకి దూకేసాడు. విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసాడు. దీనితో అల్లు అరవింద్ దిల్ రాజు మరియు పరశురామ్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఇద్దరినీ కడిగిపారేద్దాం అనుకున్నారు. కానీ దిల్ రాజు ఒక మెట్టు క్రిందకి దిగొచ్చి అల్లు అరవింద్ తో చర్చలు జరుపుకొని సమస్యని పరిష్కరించుకున్నాడు. ఇక పోతే నిన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరో గా గీత ఆర్ట్స్ లో ఒక సినిమా ప్రారంభం అయ్యింది.
ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా దిల్ రాజు విచ్చేశాడు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మరియు అల్లు అరవింద్ ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఎంతో ఫ్రెండ్లీ గా ఉండడాన్ని చూసి వీళ్లిద్దరి మధ్య ఉన్న గొడవలు సర్దుకున్నాయా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ వీళిద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉండి వాటిని పరీక్షించుకుంటే చాల మంచిది. మన టాలీవుడ్ లో ఇలా మనం గొడవపడటం మంచిది కాదు అని, వేరే ఇండస్ట్రీ వాళ్ళ ముందు మన పరువు పోతుంది అని కూడా కొందరు నెటిజనులు వాపోయారు. మీ అభిప్రాయం ఏంటో కూడా మాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.