Krithi Shetty: కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఈ కుర్ర హీరోయిన్ సృష్టించిన సెన్సేషన్ మామూలుది కాదు. తొలిసినిమాతోనే అందం లో కానీ, నటనలో కానీ తానూ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈ అమ్మాయికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి(Krithi Shetty Relationship). వయస్సు లో చాలా చిన్న కాబట్టి ఈమెకి స్టార్ హీరోల సరసన నటించే రేంజ్ కి ఇంకా రాలేదు కానీ, యంగ్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ మాత్రం కొట్టేసింది.
‘ఉప్పెన’ తర్వాత వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా ఫ్లాప్స్ ఈమెని పలకరించాయి. అవి మామూలు రేంజ్ ఫ్లాప్స్ కూడా కాదు, డిజాస్టర్ ఫ్లాప్స్. దీనితో తారాజువ్వ లాగ నింగికి ఎగసిన కృతి శెట్టి కెరీర్ ఒక్కసారిగా పాతాళలోకం లోకి పడిపోయింది. ఇప్పుడు ఈమెతో సినిమాలు చేసేందుకు ఏ నిర్మాత కూడా సిద్ధం గా లేడు. యంగ్ హీరోలు కూడా ఈమెని తమ సినిమాల్లో తీసుకోవాల్సిందిగా అడగడం లేదు. దీంతో ఒక్కసారిగా అంధకారం లోకి వెళ్ళిపోయింది కృతి శెట్టి కెరీర్. అయితే దీనిని అడ్డం పెట్టుకొని కృతి శెట్టి కెరీర్ మళ్ళీ పైకి లెయ్యడానికి ఒక స్టార్ డైరెక్టర్ తెగ ప్రయత్నం చేస్తున్నాడట.
దానికి బదులుగా కృతి శెట్టి ని కమిట్మెంట్స్ అడుగుతున్నాడట(Krithi Shetty Relationship). సినీ రంగం మీద పిచ్చి ప్రేమ ఉన్న కృతి శెట్టి అతను ఏమి అడిగితే అది చెయ్యడానికి సిద్ధమైంది అట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈమె హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రం మీద ఆమె చాలా అంచనాలు పెట్టుకుంది, కానీ చివరికి ఆ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒక శ్రీలీల సెన్సేషన్ టాలీవుడ్ లో లెకపొయ్యుంటే కృతి శెట్టి కి ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఏమో.
కానీ ఇప్పుడు అందరూ శ్రీలీల జపం చేస్తున్నారు. ఆమె డేట్స్ ఖాళీ లేకపోతే మిగిలిన హీరోయిన్స్ వైపు చూస్తున్నారు. మరి కృతి శెట్టి నమ్ముకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఆమె కెరీర్ ని నిలబెడుతాడో లేదో చూడాలి. కృతి శెట్టి ఇప్పుడైతే ఒక తెలుగు సినిమా కూడా లేదు. తను ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది, అందులో ఒకటి తమిళ్ సినిమా మరొకటి మళయాలం సినిమా.
ఆ రెండు సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతున్నాయి. తెలుగు లో ఒక్క సినెమా కూడా లేకపోయే సరికి బేబమ్మ ఫాన్స్ తెగ ఫీల్ ఐపోతున్నారు. తెలుగు సినిమాలో అవకాశం రాక చేయటం లేదా లేదా కధలు నచ్చక చేయటం లేదా అనేది తెలియదు.