Home Cinema Sreeleela: తన కోరిక తీర్చమంటూ శ్రీలీలకు చుక్కలు చూపిస్తున్న ఆ ముసలి డైరెక్టర్..

Sreeleela: తన కోరిక తీర్చమంటూ శ్రీలీలకు చుక్కలు చూపిస్తున్న ఆ ముసలి డైరెక్టర్..

Sreeleela: సినీ పరిశ్రమలో ఏ ఇండస్ట్రీ కి వెళ్లిన కామన్ గా వినిపించే సమస్య క్యాస్టింగ్ కౌచ్. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన ఆడవాళ్లను కొంతమంది దర్శక నిర్మాతలు కోరికలు తీర్చమంటూ అడగడమే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇది వరకే చాలా మంది హీరోయిన్స్ దీని గురించి మాట్లాడారు. కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ అనేది వ్యక్తిగత ఛాయస్ అని, సినిమాల్లో అవకాశం లేకపోతే వేరే దిక్కు లేదు అని అనుకున్నవాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు(Director Insisting Sreeleela). అందులో ఎలాంటి తప్పు లేదు, కానీ ఏదైనా ఇష్టం మీదనే జరగాలి, బలవంతం చేస్తే మాత్రం అది చాలా తప్పు అని కొంతమంది హీరోయిన్స్ అంటున్నారు.

sreeleela-crying

ఇప్పుడు ఇండస్ట్రీ లో బుల్లెట్ లాగ దూసుకుపోతున్న శ్రీలీల కూడా వచ్చిన కొత్తల్లో ఇలాంటి సంఘటనలు చాలానే ఎదురుకుందట. గతం లో ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. కన్నడ లో 50 ఏళ్ళు నిండినా ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రతీ రోజు శ్రీలీల కి ఫోన్లు చేసి వేధించేవాడట. తన కోరిక తీరిస్తే ఇండస్ట్రీ లో ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి తీసికెళ్తాను అని రోజు ఫోన్లు చేసి విసిగించేవాడట(Director Insisting Sreeleela). నాకు ఇష్టం లేదు అని శ్రీలీల పదే పదే చెప్పినా కూడా వినకుండా వేధిస్తూ ఉండేవాడట. ఇక వాటిని తట్టుకోలేక శ్రీలీల ఒక రోజు తన అమ్మగారికి జరుగుతున్న సంఘటనలన్నీ చెప్పేసిందట.

బెంగళూరు సిటీ లో మంచి పలుకుబడి ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ లో ఒకరైన శ్రీలీల తల్లి ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి చాలా కఠినమైన వార్నింగ్ ఇచ్చిందట. ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది మీకు, ఇంత బ్రతుకు బ్రతికి ఆడపిల్లను వేధించాను అనే కేసు మీద జైలు కి వెళ్తే మీ పరువు మొత్తం పోతుంది. నువ్వు మాట్లాడిన మాటలు రికార్డింగ్స్ తో సహా నా దగ్గరా అన్నీ ఉన్నాయి, ఇంకోసారి నువ్వు మా అమ్మాయికి ఫోన్ చేస్తే నేరుగా ఇవన్నీ పోలీస్ కి చేరుతాయి అని బెదిరించిన తర్వాత ఆ డైరెక్టర్ సైలెంట్ అయ్యాడట. ఇంతకు ఎవరు ఆ డైరెక్టర్ అనే విషయం బయటకి రాలేదు కానీ, ఆ డైరెక్టర్ కి తర్వాత కెరీర్ అనేదే లేకుండా పోయిందని సమాచారం.

శ్రీలీల ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ముందు పూజ హెగ్డే ని హీరోయిన్ గా అనుకున్న త్రివిక్రమ్, మహేష్ బాబు ఒద్దు అనటం తో పూజ ని తొలగించి శ్రీలీల ని ఖరారు చేసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో రోజుకి ఒకరిని తీసేస్తున్నారు లేదా వారే వదిలేసి వెళ్లిపోతున్నారు దీనితో శ్రీలీల ఫాన్స్ సంకోచంలో పడ్డారు అనే చెప్పుకోవాలి. శ్రీలీల ను ఉంచుతారో లేద్ పూజాని తీసేసినట్టు తీసేస్తారేమో అభిమానులు భయంతో సచ్చిపోతున్నారు అంట.

Exit mobile version