Rajamouli : రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ని ప్రపంచపట్టం లో పెట్టాడు రాజమౌళి. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ప్లాప్ లేకుండా ట్రాక్ రికార్డు ఉంది రాజమౌళికి. బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయాడు రాజమౌళి. సాధారణంగా డైరెక్టర్ లు ప్రొడ్యూసర్ చుట్టూ తిరుగుతారు కానీ రాజమౌళి విషయంలో అది రివర్స్, ప్రొడ్యూసర్లే రాజమౌళి చుట్టూ తిరుగుతారు మేమంటే మేము డబ్బు పెడతాం అని.
రాజమౌళి తన పర్సనల్ బ్రాండ్ అలా తయారు చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక సినిమాల విషయం పక్క పెట్టి రాజమౌళి భార్య రమా రాజమౌళి గురించి మాట్లాడుకుందాం. రమా కు రాజమౌళి ని పెళ్లి చేసుకుంది ముందు ఇంకో పెళ్లి జరిగింది. భర్త మంచివాడు కాదు ఎల్లప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉండటంతో రమా తన అక్క ఇంటికి వెళ్ళిపోయింది. కార్తికేయ వారికి పుట్టిన సంతానం.
ఎన్ని రోజులు అయినా మొదటి భర్త మారకపోవడంతో వాడిని వదిలేసింది రమా. ఆ సమయంలోనే రాజమౌళి రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజానికి రమా రాజమౌళి కంటే 4 ఏళ్ళు పెద్దది అట. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న వయసు తేడా గురియించె సోషల్ మీడియా మొత్తం చర్చ. అలా రమా ను పెళ్లి చేసుకొని రాజమౌళి తన మంచి మనసును చాటుకున్నాడు.