Aditi Shankar: సౌత్ ఇండియా లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వంటి పదాలు ఈమధ్య మనం ఎక్కువగా వింటున్నాం, కానీ మనం పుట్టకముందు నుండే ఆయన పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటూ ఇక్కడి దాకా వచ్చాడు. తమిళ నాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ శంకర్ మాత్రమే (Aditi Shankar Remuneration). ఆయనతో సినిమా చెయ్యడం అనేది సౌత్ లో ప్రతీ సూపర్ స్టార్ కి ఒక పెద్ద కల. ఇప్పుడు రీసెంట్ గా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, మరోపక్క రీసెంట్ గానే కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇలా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు శంకర్. ఇకపోతే శంకర్ కి అదితి శంకర్ అనే కూతురు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈమె కూడా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. గత ఏడాది తమిళ హీరో కార్తీ నటించిన ‘వీరుమాన్’ ఈమె మొట్టమొదటి సినిమా. ఇప్పుడు రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ తో కలిసి నటించిన ‘మావీరన్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా మరోసారి మన ముందుకు వచ్చింది.
ఈ సినిమా తెలుగు లో ‘మహావీరుడు’ పేరుతో విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే అదితి శంకర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తండ్రికి హీరోయిన్ గా నేను ఇండస్ట్రీలోకి రావడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కానీ నేను పట్టుబట్టడం తో అయిష్టంగానే ఒప్పుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ‘నీకు అవకాశాలు రప్పించేందుకు నేను ఎలాంటి ప్రయత్నాలు చెయ్యను, నీ సొంత టాలెంట్ తోనే అవకాశాలు రప్పించుకో, ఒకవేళ అవకాశాలు రాలేదంటే మాత్రం సినిమా పేరు ఎత్తడానికి కూడా ఒప్పుకోను అని షరత్తు పెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చింది అదితి శంకర్.
అయితే తన సొంత కష్టం తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అదితి, ఇప్పుడు కోలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా ముందుకు దూసుకుపోతుంది, అయితే ఈమె ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కేవలం 20 లక్షల రూపాయిలు మాత్రమే తీసుకుంటుంది అట (Aditi Shankar Remuneration), ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం, కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ తగిలితే ఈమె తన రెమ్యూనరేషన్ ని పెంచే అవకాశం ఉంది.