రాజమౌళి మహేష్ బాబు తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో ఇండియా లెవెల్ లో క్రేజ్ అందుకున్న రాజమౌళి, బాహుబలి 1 & 2 తో భారత సినీ చరిత్రలో కొత్త రికార్డులను తిరగరాశారు. 1000 కోట్లు వసూళ్లు చేసిన మొదటి భారత సినిమా బాహుబలి దర్శకుడు రాజమౌళినే. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి తీసిన సినిమా RRR. ఇక ఈ సినిమా ఐతే రాజమౌళిని ఇంటర్నేషనల్ డైరెక్టర్ జాబిఓథాలో చేర్చింది అని చెప్పుకోవచ్చు.
నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావటంతో ప్రపంచ సినీ ఇండస్ట్రీలు అన్ని రాజమౌళి గురించి మాట్లాడుకునేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమని హాలీవుడ్ రేంజ్ కి తీసుకు వెళ్లి మన తెలుగు వారి స్థాయిని ఇంకా పెంచేసాడు రాజమౌళి. జపాన్ లో RRR సినిమా కు ఇప్పటికి టిక్కెట్లు దొరకటం లేదు అంటే ఆ క్రేజ్ ఎలా ఉందొ మిరే ఆలోచించుకోండి. ఇక విషయానికి వస్తే రాజమౌళి మహేష్ బాబుతో తాను చేసే సినిమా కోసం పని మీద జపాన్ వెళ్ళటం జరిగింది.
జపాన్ లో రాజమౌళి తిరుగుతూ ఉండగా ఒక్క సారిగా భూకంపం వచ్చింది. దీనితో రాజమౌళి, కార్తీకేయ, శోబు గారికి చాలా భయం వేసిన్నది అట. ఒకపక్క ఆందోళన పడుతూ ఎం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా అక్కడ ప్రజలు మాత్రం ఎం జరగనట్టు ఏదో వర్షం పడుతున్నట్టు చాలా లైట్ తీసుకున్నారు అట. ఈ భూకంపం వచ్చే సమయానికి వీరు 28వ ఫ్లోర్ లో ఉన్నారు అట. మహేష్ బాబుతో సినిమా జక్కన ప్రాణాల మీదకు వచ్చేలా ఉంది అంటూ ఫాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Felt a freaking earthquake in Japan just now!!!
Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D— S S Karthikeya (@ssk1122) March 21, 2024