Home Cinema టిల్లు స్క్వేర్ సినిమాను వదులుకొని ఇప్పుడు బాధ పడుతున్న ఆ స్టార్ హీరో ఎవరు..?

టిల్లు స్క్వేర్ సినిమాను వదులుకొని ఇప్పుడు బాధ పడుతున్న ఆ స్టార్ హీరో ఎవరు..?

టిల్లు స్క్వేర్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ అయింది. యావరేజ్ టాక్ తో బాగానే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులకి దెగ్గరయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ. తన సొంత స్టైల్, బాడీ లాంగ్వేజ్, బాష తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన సినిమానే టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గ నటిస్తుంది.

ఈ సినిమాలో కూడా సిద్దు అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మిడిల్ లో తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే ఈ సినిమా ముందుగా సిద్దు కోసం రాసుకున్నది కాదు అట. ఈ సినిమా వేరే స్టార్ హీరో కోసం రాసుకున్నారు అట. ఆ హీరో రిజెక్ట్ చేయటంతో చేసేది ఏమి లేక సిద్దు తో చేసారు. ఇంతకీ ఎవరు ఆ హీరో అనుకుంటున్నారా? ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ.

vijay-devarakonda

సినిమా హిట్ అవుతాది అని తెలిసి కూడా విజయ్ ఈ సినిమా చేయలేదు అట. ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెళ్లి కథ చెప్పగా ప్రతి సినిమాలోనూ ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేస్తే బాగుండదు అని చెప్పి స్మూత్ గ రిజెక్ట్ చేసాడు అట. ఈ విషయం తెలిసిన ఫాన్స్ మంచి పని చేసావ్ అంటూ అభినందిస్తున్నారు. ఎక్కడైనా మంచి హిట్ సినిమా ఛాన్స్ మిస్ ఐతే ఫీల్ అవుతారు గాని ఇదేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజనులు.

Exit mobile version