Chiranjeevi Bad Habit: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగా స్టార్ చిరంజీవి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ఆ తర్వాత హీరో గా మారి , ఒక్కో మెట్టు ఎక్కుతూ, హిట్ మీద హిట్ కొడుతూ ఎవరూ అందుకోలేంత రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీ లో బడా హీరోల కొడుకులు ఒక్కొక్కరిగా వస్తున్నప్పటికీ చిరంజీవి సునామి ముందు నిలబడలేకపోయారు. సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరో గా కొనసాగి, ఇప్పటికీ కూడా నెంబర్ 1 స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయనకి ఏకంగా మూడు వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టాడు.
ఇక ఇప్పుడు ఆయన మరో నాలుగు రోజుల్లో ‘భోళా శంకర్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రతీ ఒక్కరు తమకి మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ, ఆయన మంచితనం గురించి మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది(Chiranjeevi Bad Habit). ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ. అదంతా పక్కన పెడితే చిరంజీవి లోని మంచితనాన్ని అందరూ చాలా ఇష్టపడుతారు.
తనకి హాని చెయ్యాలని కోరుకున్న వ్యక్తులకు కూడా మేలు చేసే అత్యున్నత స్థాయి మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే సొంతం. అయితే ఆ అతి మంచితనమే చిరంజీవి చెడు లక్షణం అని, అంత క్షమా గుణం అవసరం లేదని, క్షమాపణ పొందిన వాళ్ళు ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండరు, ఏమి చేసిన భరిస్తాడు అనే అలుసుతో చిరంజీవి ని ఎంతో మానసిక క్షోభ కి గురి చేసారని. కానీ చిరంజీవి మాత్రం ఇప్పటికీ వాళ్ళను తన ఆత్మీయులుగానే చూస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఈ స్థాయి అతి మంచితనం ఎప్పుడూ చెడుని మాత్రమే చేస్తుందని, మంచిని అసలు చెయ్యదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. కానీ ఎవరెన్ని చెప్పిన చిరంజీవి స్వభావం మారిపోదుగా..!, కానీ ఆయనని ఒక్క మాట అన్నా కూడా ఈమధ్య అభిమానులు అసలు సహించడం లేదు, ఆవేశం తో చెలరేగిపోతున్నారు. గొప్ప మనిషిని ఇష్టపడే వారి కోపం బహుశా ఇలాగే ఉంటుందేమో.