Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో మన సినీ తారలు దాదాపు ప్రేమ వివాహమే చేసుకుంటారు. అలానే అల్లు అరవింద్ కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్నేహ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. స్నేహ రెడ్డి(Allu Arjun Sneha) సినిమాలకు సంబంధం లేని కుటుంబం నుండి వచ్చింది. ఈమె తండ్రి ఓ వ్యాపారవేత్త. ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి. ఈ అమ్మడు హైద్రాబాద్లోనే ఉంది మరియు పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళింది. అయితే అల్లు అర్జున్ మరియు స్నేహ ఎలా పరిచయం అయిందో ఇపుడు మనం తెలుసుకుందాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డిల ఫ్రెండ్ ఒక్కరు నైట్ పార్టీ ఆరెంజ్ చేసాడట మరియు ఆ పార్టీకి స్నేహ కూడా విచ్చేసిందంట. అలా ఆ పార్టీలో ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తరువాత వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఒక రోజు అల్లు అర్జున్ ప్లాన్ చేసి స్నేహ రెడ్డికి తన లవ్ ప్రపోస్ చేసాడు మరియు స్నేహ(Allu Arjun Sneha) వెంటనే ఓకే అని చెప్పేసిందట. ఆ తరువాత వీరిద్దరూ కొద్దీ రోజులు డేటింగ్ చేసాక, ఇంట్లో వాళ్లకి వీరి ప్రేమ గురించి చెప్పారట.
అయితే మొదట ఇద్దరు ఇంట్లోనూ ఈ పెళ్ళికి ఒప్పుకోలేదట. కానీ ఈ ఇద్దరు తమ ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని వారి తల్లితండ్రులకు వివరంగా చెప్పి వారిని కూడా పెళ్ళికి ఓకే అనేలా చేసారు. 2010 లో వీరి ఎంగేజ్మెంట్ అయింది మరియు 2011 లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరు ప్రేమించుకునే రోజులో అల్లు అర్జున్ తన భార్యకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదంట. కానీ వీరి ఎంగేజ్మెంట్ కు అల్లు అర్జున్ తన కాబోయే భార్యకు ఇదొక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఆమె కోసం 40 లక్షల డైమండ్ రింగ్, 60 లక్షల గోల్డ్ ఐటమ్స్ మరియు 2 లక్షల పట్టు చీర స్నేహ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది చూసి స్నేహ రెడ్డి ఎమోషనల్ అయిపోయి ఒకసరిగ్గా అల్లు అర్జున్ ను హత్తుకుంది. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకొని హాయిగా సంసారం చేస్తున్నారు మరియు వీరి ప్రేమకు ఇద్దరు పిల్లలు కూడా ఫుటరు. మొదటి సంతానం కుమారుడు.
తన పేరు అల్లు అయాన్. రెండో సంతానం కుమార్తె, తన పేరు అల్లు అర్హ. అల్లు అర్హ ఇటీవల విడుదలైన శకుంతలంలో చిన్న వయసులో సమంతల నటించింది. ఇక అల్లు అర్జున్ సినిమాల ముచ్చటకు వస్తే, ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప రెండో భాగం షూటింగ్లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేద్దామని ప్లాన్ చేస్తునారు చిత్ర యూనిట్.