Home Cinema Eesha Rebba : టాలీవుడ్ లో ప్రతి డైరెక్టర్ తో అది చేయాలి.. ఘాటు వ్యాఖ్యలు...

Eesha Rebba : టాలీవుడ్ లో ప్రతి డైరెక్టర్ తో అది చేయాలి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈషా రెబ్బ..

eesha-rebba

Eesha Rebba: అందం మరియు టాలెంట్ రెండు ఉన్న హీరోయిన్స్ దొరకడం ఏ ఇండస్ట్రీ లో అయినా కష్టమే. కానీ ఆ రెండు ఉన్నప్పటికీ కూడా దర్శకులు గుర్తించకపోవడం కారణంగా కొంతమంది హీరోయిన్స్ వెలుగులోకి రాకముందే మాయం ఐపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఈషా రెబ్బ. వరంగల్ కి చెందిన ఈ అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయి, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికే ఈషా రెబ్బ కి మాత్రం అవకాశాలు వచ్చాయి.

eesha-rebba

‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘బందిపోటు’, ‘అమీ తుమీ’ మరియు ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఈమెకి అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేదు, ఆమె అందం , అభినయం కి తగ్గ స్టేటస్ ఇప్పటి వరకు రాలేదు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనేందుకు కొన్ని ఉదాహారణలతో ఒకటిగా నిలిచిపోయింది ఈషా(Eesha Rebba) రెబ్బ. పాపం ఆమె ప్రతిభ కి తగ్గ గుర్తింపు రాకపోవడం తో ఇప్పుడు ఈమె సోషల్ మీడియా లో అందాలను ఆరబోస్తూ కాలం గడిపేస్తుంది. ఎన్టీఆర్ సినిమా లో అవకాశం వచ్చినప్పుడు ఈమెకి ఇక టాలీవుడ్ లో తిరుగేలేదు అని అనుకున్నారు.

eesha-rebba-about-tollywood

కానీ అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘టాలీవుడ్ అంటే నాకు ఎంతో గౌరవం, నేను తమిళ్ మరియు మలయాళం ఇండస్ట్రీస్ లో నటిస్తున్నప్పుడు అక్కడి నటీనటులు టాలీవుడ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవారు. అవి విని నేను ఎంతో గర్వపడేదానిని. కానీ ఇక్కడ మాత్రం మన దర్శక నిర్మాతలు తెలుగు వచ్చిన హీరోయిన్స్ కంటే కూడా తెలుగు రాని హీరోయిన్స్ వెంట పడుతున్నారు. అందువల్ల నాలాంటి అచ్చ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేకుండా పోతున్నాయి.

eesha-rebba-actress

ఇతర రాష్ట్రాల నుండి హీరోయిన్స్ ని దిగుమతి చెయ్యండి అని ప్రేక్షకులు డైరెక్టర్స్ ని కోరడం లేదు, అలాంటప్పుడు వారికే ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు? ఎక్కడా జరగని దరిద్రాలు అన్నీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే జరుగుతున్నాయి’ అంటూ ఈషా(Eesha Rebba) రెబ్బ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక రీసెంట్ గా ఈమె సుధీర్ బాబు తో కలిసి ‘మామ మాస్చిందా’ అనే చిత్రం లో నటించింది. ఈషా ప్రస్తుతం తెలుగు మామ మశ్చీంద్ర అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది 21 జులై న విడుదలకు సిద్ధంగా ఉంది.