Home Cinema Chiranjeevi – Nagarjuna : ఆ హీరోయిన్ కోసం పబ్లిక్ లో గొడవపడ్డ చిరంజీవి –...

Chiranjeevi – Nagarjuna : ఆ హీరోయిన్ కోసం పబ్లిక్ లో గొడవపడ్డ చిరంజీవి – నాగార్జున.. వైరల్ అవుతున్న వీడియో..

Chiranjeevi – Nagarjuna : టాలీవుడ్ లో సెలబ్రిటీస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున పేర్లు ముందు వరుస లో ఉంటాయి. వీళ్లిద్దరి(Chiranjeevi Nagarjuna Fight) మధ్య స్నేహం నిన్న గాక మొన్న పుట్టింది కాదు. దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం నుండి సాగుతున్న గొప్ప స్నేహం వీళ్ళిద్దరిది. ఒకే తల్లి కడుపునా పుట్టకపోయిన సొంత అన్నదమ్ములు లాగా కలిసి మెలిసి ఉంటారు వీళ్లిద్దరు. చిరంజీవి కోసం నాగార్జున, నాగార్జున కోసం చిరంజీవి ఎలాంటి సహాయం చేసుకోడానికి అయినా వెనుకాడరు.

fight-between-chiranjeevi-and-nagarjuna-because-of-that-heroine

ఒకే తరం లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఇంత స్నేహ భావం తో మెలగడం అనేది బహుశా ఇదే మొట్టమొదటిసారి అనుకుంట. నేటి తరం ప్రేక్షకులకు కూడా వీళ్లిద్దరి స్నేహం ఎంతో ఆదర్శం. వీళ్లిద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేసారు. ఒకప్పుడు స్టార్ మా ఛానల్ ని కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు రన్ చేసారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సోనీ టీవీ కి ఛానల్ ని అమ్మేసారు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో వజ్రోత్సవం వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే.

ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ ఈవెంట్ తో ముడిపడి ఉన్నాయి. ఈ ఈవెంట్ లో చిరంజీవి మరియు నాగార్జున మధ్య జరిగిన ఒక చిలిపి గొడవ అప్పట్లో తెగ వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ యాంకర్ సుమ చిరంజీవి , నాగార్జున పక్కన కూర్చున్న రమ్య కృష్ణ వద్దకి వెళ్లి, మీరు ఈ ఇద్దరితో కలిసి నటించారు కదా, మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా, చిరంజీవి నేనే అంటూ తల అడ్డు పెడుతాడు. అప్పుడు నాగార్జున కాదు నేను అంటూ ముందుకు వస్తాడు.

నాతో చాలా సినిమాలు చేసింది, కాబట్టి నేనే ఫేవరెట్ హీరో అని నాగార్జున, నాతో చాలా చక్కటి పేరు ని తెచ్చిపెట్టిన సినిమాలు చేసింది అంటూ చిరంజీవి ఇద్దరూ కూడా సరదాగా గొడవ పడ్డారు.

అప్పుడు రమ్య కృష్ణ నా కోసం ఇంత పెద్ద స్టార్ హీరోలు కొట్టుకుంటున్నారు, ఇంతకు మించిన అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది చెప్పండి అంటూ రమ్య కృష్ణ సమాధానం ఇస్తుంది. ఈ వీడియో(Chiranjeevi Nagarjuna Fight) చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ అయ్యింది.

Exit mobile version