Friday, July 5, 2024
HomeCinemaVijay Devarakonda : రౌడీ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్ కంఫర్మ్..

Vijay Devarakonda : రౌడీ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్ కంఫర్మ్..

Vijay Devarakonda : టాలీవుడ్ సినిమా నుండి బాలీవుడ్ సినిమా వరకు విజయ్ దేవరకొండ తెలియని వారు ఉండరు. ఈయన ఎవడె సుబ్రహ్మణ్యం, లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమాలతో నటుడుగా తెలుగు ప్రజలకు పరిచమయ్యారు. ఆ తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచమయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో బారి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగారు.

విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేసారు. ఈ సినిమా ద్వారా విజయ్ బాలీవుడ్ లో కూడా సుపరిచితుడే. కానీ ఈ సినిమా డిసాస్టర్ గా నిలిచింది. అక్కడ నుండి విజయ్ కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. అయితే విజయ్ దేవరకొండ ఖచ్చితంగా మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే కథలను చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తన కెరీర్ లోనే హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలో రానుందని సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించడంతో అభిమానులు గాలి పీల్చుకుంటున్నారు.

good-news-to-vijay-devarakonda-fans-as-sequel-confirmed-for-his-hit-cinema

విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన గీత గోవిందం సీక్వెల్ త్వరలో ప్రారంభం కానుంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో సీక్వెల్ రానుంది. ఏది ఏమైనా తన కాంబినేషన్ లో మరో మంచి సక్సెస్ ఫుల్ సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు విజయ్. ఈ సినిమా హిట్ అయితే విజయ్ ను ఆపడం ఎవరి తరం కాదు అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts