Home Cinema Gopichand : ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని గోపీచంద్ ఎందుకు వదిలేసాడంటే..

Gopichand : ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని గోపీచంద్ ఎందుకు వదిలేసాడంటే..

Gopichand : మన తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు గోపీచంద్ తెలువకుంట ఎవరు ఉండరు. మ్యాచో స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో తన చిన్న వయసులోనే సినిమా రంగంలోకి హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటిలో ఈయనకు ఉన్న క్రేజ్ ఈ కాలం ప్రేక్షకులకు తెలీదు అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం హీరో గోపీచంద్ కు (Gopichand Unknown Love Story) ఒక్క హిట్ కూడా లేక చాల సంవత్సరాలు అయ్యింది. ఈయన కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.

gopichand-unknown-love-story-with-actress-sneha-while-doing-their-first-movie-together

ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఉన్న సిట్యుయేషన్స్ బట్టి చూస్తే గోపీచంద్ సరిగా ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు అని తెలుస్తుంది. గోపీచంద్ ఎలాగైనా తన ప్లాప్ ట్రాక్ ను మార్చడానికి వరుసగా సినిమాలు చేసుకుంటా పోతున్నారు. కానీ సక్సెస్ మాత్రం ఆయనకు దక్కడం లేదు. దీనికి గల కారణం డైరెక్టర్లు మరియు వారు చెప్పే పాతకాలపు స్టోరీలు. అయితే ఈయన అభిమానులు మాత్రం తన కంబ్యాక్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ పాత జ్ఞాపకం ఒకటి వైరల్ అవ్వుతుంది.

అదేంటంటే, గోపీచంద్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తొలివలుపు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటి స్నేహ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాలో సెట్ అయింది మరియు ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ లో గోపీచంద్ మరియు స్నేహల మధ్య సన్నిహితం పెరిగి, ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అయితే గోపీచంద్ మాత్రం స్నేహను మొదటిసారి చూడగానే పడిపోయాడట. పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని పట్టు పట్టి కూర్చున్నాడంట గోపీచంద్.

అయితే ఒకానొక రోజు స్నేహకు తన ప్రేమ విషయం చెపుదామని ఫిక్స్ అయ్యాడట. కానీ నటి స్నేహ మాత్రం షూటింగ్ సమయంలో తనను ఓ సోదరుడిలా అనుకుంటున్న అని షూటింగ్ స్పాట్ లో ఎవరితోనో అంటుంటుంటే గోపీచంద్ విని బాధపడదు అని తెలిసింది. ఆ తరువాత వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.

ఏది ఏమైనా ప్రస్తుతం ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని సుఖజీవితాని పొందుతున్నారు. గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలుని పెళ్లి చేసుకున్నాడు. నటి స్నేహ సినిమాలు చెయ్యడం ఆపేసింది. నటుడు గోపీచంద్ మాత్రం సినిమాలు చేస్తునాడు మరియు ప్రస్తుతం ఆయనకు ఒక్క హిట్ సినిమా కూడా లేకపోవడంతో నటుడు సినీ రంగంలో ఇబ్బంది పడుతున్నాడు. (Gopichand Unknown Love Story)

Exit mobile version