Home Cinema Dhanush : హీరో ధనుష్ పై బ్యాన్..షాక్ లో అభిమానులు..

Dhanush : హీరో ధనుష్ పై బ్యాన్..షాక్ లో అభిమానులు..

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ అల్లుడుగా సినీ పరిశ్రమలో తన పలుకుబడి లేదా వారసత్వంపై ఆధారపడకుండా కేవలం తన సొంత ప్రతిభతోనే అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు. అంతే కాకుండా ఈ మధ్య రిలీజ్ అయినా సర్ సినిమా తో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేరు .

hero-dhanush-ban-red-card

ధనుష్ ఇటీవల సార్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ తన సినిమాలను ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. అంతే కాకుండా ఈ మధ్య హాలీవుడ్ సినిమా లో కూడా నటించారు . ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ధనుష్ కోసం కోలీవుడ్ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని వినిపిస్తోంది. తమిళ నిర్మాతల మండలి ధనుష్ కు రెడ్ కార్డ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ధనుష్‌తో సినిమాలు తీయడం నిర్మాతలకు సాధ్యం కాదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే శ్రీ థెండ్రాల్ ఫిలింస్ నిర్మాణంలో ధనుష్ ఓ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చి, అందుకు అడ్వాన్స్ తీసుకున్నారట.చాలా కాలంగా డబ్బులు తీసుకుని సినిమా చేయలేదు. అప్పటి నుంచి సినిమా చేయకపోవడంతో నిర్మాత తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో తమిళ నిర్మాతల మండలి ధనుష్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయితున్నారు. (Dhanush)

నిర్మాతను మోసం చేసినందుకు రెడ్ కార్డ్ వేసే ఆలోచనలో నిర్మాత మండలి ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అయితే ధనుష్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రస్తుతం ధనుష్ తమిళ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తున్నారు . ఇది 1930ల కాలం నాటి నేపథ్యంలో సాగే యాక్షన్-పీరియడ్ స్టోరీ గా చెప్పబడింది.

ఆ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మరియు ఇందులో అతను కఠినమైన లుక్‌లో ఆశ్చయపెట్టాడు . కెప్టెన్ మిల్లర్ కంటే ముందుగా విమానాశ్రయంలో ధనుష్ దాదాపుగా గుర్తుపట్టలేనట్లు కనిపిస్తున్నాడు. (Dhanush)

Exit mobile version