Hema : ఇటీవల బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి నటి హేమ హాజరైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రచారంపై నటి హేమ స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఎం చెప్పిందో ఏంటో చూద్దాం. నటి హేమ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం నుండి ఆర్టిస్ట్ గా ఉంది. ఈమె మంచి పేరు కూడా సంపాదించుకుంది. నటి హేమ ప్రస్తుతం సినిమాలలో అంతగా కనిపియ్యడంలేదు.
అయితే ఇటీవల హేమ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల ఓ రేవ్ పార్టీలో హేమ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, నేను ఆ పార్టీలో లేనని వివరించింది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో నటి హేమ పేరు ఎందుకు వినిపించింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్ లో భారీ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ రేవ్ పార్టీలో కొకైన్ లాంటి డ్రగ్స్ కూడా ఎక్కువగా సేవించినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అక్కడ ఏపీ వైసీపీ కీలక నేత పేరున్న కారు కూడా కనిపించింది. అయితే ఈ రూమర్‌పై నటి హేమ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. బెంగళూరులో జరిగే రేవ్ పార్టీకి నేను వెళ్లలేదు’ అని హేమ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాను. ఇక్కడ నా ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. కానీ బెంగుళూరులో జరిగిన పార్టీలో నేను పట్టుబడ్డానంటూ ప్రచారం చేశారు. ఇందులో వాస్తవం లేదు అంటూ ఘాటుగా స్పందించింది.