Sunday, July 7, 2024
HomeCinemaSuma: అర్థరాత్రి సుమకి ఆ హీరో ఫోన్ చేసి ఏకంగా అలాంటివి అడిగాడా..?

Suma: అర్థరాత్రి సుమకి ఆ హీరో ఫోన్ చేసి ఏకంగా అలాంటివి అడిగాడా..?

Suma: ఎన్నో ఏళ్ళ నుండి తెలుగు బుల్లితెర పై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న యాంకర్స్ లిస్ట్ బయటకి తీస్తే అందులో సుమ పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. బుల్లితెర పై ప్రసారం అయ్యే షోస్ లో ఎక్కువ శాతం ఈమె యాంకర్ గా వ్యవహరించేవే ఉంటాయి. అంతే కాదు ఆడియో ఫంక్షన్స్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా ఈమె కచ్చితంగా ఉండాల్సిందే(Nani Hero). పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల దగ్గర నుండి చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల వరకు, అలాగే నాని, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోల దగ్గర నుండి అప్ కమింగ్ హీరోల వరకు, ప్రతీ ఒక్కరికి సుమ డేట్స్ కావాలి.

rajeev-kanakala

ఎన్నేళ్లు అయినా ఇది మారడం లేదు. చలాకి తనం తో ఆమె చేసే యాంకరింగ్, వేసే పంచులు, చేసే కామెడీ ఇవన్నీ కూడా ఆమెని ఈ స్థాయిలో నిలబెట్టాయి అని చెప్పొచ్చు. అలాగే ఈమెకి హీరోలతో కూడా మంచి స్నేహపూర్వక బాండింగ్ ఉంటుంది. అందరూ ఈమెతో ఎంతో క్లోజ్ గా ఉంటారు. వారిలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు(Nani Hero). నాని తో కలిసి ఈమె చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ చాలా సరదాగా ఉంటాయి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు టైమింగ్ అదుర్స్. అయితే ఒకానొక సమయం లో హీరో నాని సుమకి అర్థ రాత్రి కాల్ చేసి మాట్లాడిన మాటలు ఆమెకి తెగ చిరాకు పుట్టించింది అట.

nani

ఎందుకంటే అది ప్రాంక్ కాల్. ఒకరోజు అర్థ రాత్రి సమయం లో ఫోన్ చేసి ‘మిమల్ని మా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. కానీ ఈ సినిమాకి మీకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వబడదు. సినిమా ఫ్లాప్ అయితే మీరే తిరిగి మాకు ఇవ్వాలి’ అని అన్నాడట. సుమ కి చాలా చిరాకు కోపం వచ్చి, ఆమె భర్త రాజీవ్ కనకాల కి ఫోన్ ఇచ్చిందట. రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఎవడ్రా నువ్వు మూసుకొని ఫోన్ పెట్టు బే’ అని నాలుగు బూతులు మాట్లాడేసి పెట్టేసాడట. మళ్లీ ఎవరో అనుకుంటారని వెంటనే ఫోన్ చేసి, నేను నాని అని నిజం చెప్పాడట.

rajeev-kanakala-nani

అలా వీళ్ళ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంఘటన గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుమ చెప్పుకొచ్చింది. సుమ రాజీవ్ విడాకులు తీసుకోబోతున్నారు అని కూడా ఇటీవల కాలంలో చాలానే వార్తలు వచ్చాయి. దాని గురించి కూడా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు సుమ, వారిద్దరి మధ్య గొడవలు ఉన్న మాట నిజమే కానీ విడాకులు తీసుకోవాలి విడిపోవాలి అని మేము ఎన్నడూ అనుకోలేదు.

అలాంటి వార్తలు విన్నప్పుడల్లా నాకు చాలా బాధ వేసేది. మొగుడు పెళ్ళాలు అన్నాక చిన్న చిన్న గొడవలు ఉండటం కామన్. అవి మా పర్సనల్ విషయాలు, వాటి గురించి అసలు మీకు ఎందుకు అంటూ సుమ కొద్దిగా ఫైర్ కూడా అయ్యేరు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts