Sunday, October 6, 2024
HomeCinemaSai Pallavi: హీరో నాని సాయి పల్లవిని అంత మాట అన్నాడా.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సాయి...

Sai Pallavi: హీరో నాని సాయి పల్లవిని అంత మాట అన్నాడా.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సాయి పల్లవి..

Sai Pallavi: టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సాయి పల్లవి మొదటి స్థానం లో ఉంటుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ఢీ ద్వారా ఫేమస్ అయినా సాయి పల్లవి, ఆ తర్వాత మలయాళం లో ప్రేమమ్ చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సాయి పల్లవి అవకాశాలు మెండుగా వచ్చాయి(Nani Scolded Sai Pallavi). అలా తెలుగు లో ఆమె చేసిన ఫిదా చిత్రం సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

sai-pallavi

ఇటు తెలుగు, అటు తమిళం లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి, కల్ట్ ఫ్యాన్ బేస్ ని దక్కించుకుంది. ముఖ్యంగా ఈమె నటన మరియు డ్యాన్స్ కి ఫామిలీ ఆడియన్స్ లో కూడా మంచి పేరు వచ్చింది. ఇది ఇలా ఉండగా సాయి పల్లవి న్యాచురల్ స్టార్ నాని తో కలిసి చేసిన ‘MCA’ మరియు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాల్లో సాయి పల్లవి నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ‘MCA’ చిత్రం చేస్తున్నప్పుడు సాయి పల్లవి కి నాని కి మధ్య పెద్ద గొడవ అయ్యిందట(Nani Scolded Sai Pallavi). నాని కి తన తోటి హీరోయిన్స్ తో సరదాగా ఉండడం మొదటి నుండి అలవాటు.

sai-pallavi-nani

ఇప్పటి వరకు ఆయన పని చేసిన హీరోయిన్స్ అందరితో మంచి రిలేషన్ ఉంది. అలా ఈ చిత్రం షూటింగ్ సమయం లో సాయి పల్లవి ని నాని కొన్ని విషయాల్లో ర్యాగింగ్ చేసాడట. అందుకు ఆమె చాలా హర్ట్ అయ్యింది, ఎందుకంటే సాయి పల్లవి కి నాని తో అప్పటి వరకు పరిచయమే లేదు. అలాంటిది నేరుగా ఆమెని ఆటపట్టించేసరికి ఆమెకి కోపం వచ్చిందట. ఒకరోజు సెట్స్ లో నాని పై పెద్దగా అరిచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందట. తర్వాత నాని ఆమెని సముదాయించి షూటింగ్ కి తీసుకొచ్చాడు. రోజులు గడిచే కొద్దీ వీళ్ళ మధ్య స్నేహం పెరిగింది.

hero-nani

ఇప్పుడు వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తుంది, రీసెంట్ గానే ఈ మూవీ టీం లో జాయిన్ అయ్యింది. సాయి పల్లవి ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. తిన షూటింగ్ షెడ్యూల్ మొన్ననే పూర్తి చేసుకొని ఇప్పుడు డబ్బింగ్ మొదలు పెట్టింది. ఈ సినిమా వచ్చే ఎద్ధి రిలీజ్ అవ్వబోతుంది.

సాయి పల్లవికి పుష్ప 1 లో నటించే అవకాశం వచ్చింది కానీ అప్పుడు తన డేట్స్ కాళీ లేక సినెమా చేయలేకపోయింది. ఈ సినిమాకి డేట్స్ సద్దుబాటు చేయలేకపోయాను అని చాల ఫీల్ అయింది అంట సాయి పల్లవి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts