Friday, July 5, 2024
HomeCinemaNithin : డేట్స్ లేవని శంకర్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరో నితిన్.. కానీ అసలు...

Nithin : డేట్స్ లేవని శంకర్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరో నితిన్.. కానీ అసలు కారణం ఇది..

Hero Nithin Director Shankar : ప్రముఖ నిర్మాత మరియు నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తనయుడిగా ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నితిన్ , ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించాడో మన అందరికీ తెలిసిందే. తొలిసినిమాతోనే ఇండస్ట్రీ ని షేక్ చేసి , స్టార్ హీరోల రికార్డ్స్ ని బద్దలు కొట్టడం తో నితిన్ స్టార్ హీరోల డైరెక్టర్స్ దృష్టిలో బాగా పడ్డాడు. అలా ఆయన రాజమౌళి, వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా ఒక్కరా ఇద్దరా , టాలీవుడ్ కి చెందిన స్టార్ డైరెక్టర్స్ అందరితోనూ పని చేసేసాడు. అయితే కెరీర్ మధ్యలో కొన్ని చెత్త సినిమాలు చెయ్యడం వల్ల హీరో నితిన్ మార్కెట్ జీరో అయిపోయింది.

hero-nithin-rejected-director-shankar-movie

మళ్ళీ ఆయన ఇష్క్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి, వరుస హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ మరియు ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఒక సౌత్ ఇండియన్ సెన్సషనల్ స్టార్ డైరెక్టర్ తో సినిమాని డేట్స్ సర్దుబాటు కాక వదులుకున్నట్టు వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది(Hero Nithin Director Shankar). సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ 2 డైరెక్టర్స్ ఎవరూ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు రాజమౌళి మరియు శంకర్. రాజమౌళి ఈమధ్య పాపులర్ అయ్యాడు కానీ, శంకర్ మాత్రం దశాబ్దాల క్రితం నుండే సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చరిత్ర ఉంది.

hero-nithin

ఆయనతో సినిమాలు చెయ్యడానికి సూపర్ స్టార్స్ సైతం ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది నితిన్ డేట్స్ సర్దుబాటు కాక శంకర్ సినిమాని వదిలేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విషయం లోకి వెళ్తే శంకర్ గతం లో బాయ్స్ సినిమాని హీరో నితిన్ తో చెయ్యాలని అనుకున్నాడట. హైదరాబాద్ లో నితిన్ ఇంటికి వచ్చి మరీ స్టోరీ వినిపించి ఓకే చేయించాడట. కానీ డేట్స్ ఇచ్చే సమయం లో ఆయన అప్పట్లో చేస్తున్న జయం సినిమా డేట్స్ కి మరియు ఈ శంకర్ సినిమా డేట్స్ కి క్లాష్ రావడం తో బాయ్స్ సినిమాని వాడుకుకోవాల్సి వచ్చిందట.

director-shankar

ఈ విషయాన్నీ స్వయంగా నితిన్ గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఒకవేళ శంకర్ తో సినిమా చేసి ఉండుంటే, సౌత్ లో రాజమౌళి మరియు శంకర్ ఇద్దరితో కలిసి పని చేసిన మొట్టమొదటి హీరోగా నితిన్ చరిత్రలో మిగిలిపోయేవాడు. పాపం బ్యాడ్ లక్. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా పేరు ఇంకా ఫైనల్ చేయలేదు కానీ ఈ ఏడాదే రిలీజ్ చేదాం అనుకుంటున్నారు సినిమా బృందం.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts