Surya: సౌత్ ఇండియా లో అన్నీ ప్రాంతీయ భాషల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడు సూర్య. తమిళ హీరోనే అయ్యినప్పటికీ ఈయనకి మన తెలుగు లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పుడంటే వరుస ఫ్లాప్స్ రాబట్టి కాస్త ఆయన మార్కెట్ తగ్గింది కానీ, ఒకప్పుడు సూర్య సినిమా అంటే తెలుగు లో మాములు క్రేజ్ ఉండేది కాదు(Surya Helps Fans). ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఇక్కడి స్టార్ హీరోస్ కి ఎలా అయితే టికెట్స్ అమ్ముడుపోతాయో, అలా ఆయనకీ సినిమాలకు టికెట్స్ అమ్ముడుపోయేవి. ఒకేఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తగిలితే మళ్ళీ ఆయనకీ పూర్వ వైభవం వచేసినట్టే.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే సూర్య పుట్టిన రోజు వేడుకలు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు కేరళలో ప్రాంతాలలో అభిమానులు అంగరంగవైభవంగా జరిపించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఒక విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది(Surya Helps Fans). ఇక అసలు విషయానికి వస్తే పల్నాడు జిల్లా నర్సారావు పేట నర్సారావు పేరు మండలం లో మోపువారిపాలెం కి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు పోలూరు సాయి, నక్క వెంకటేష్ సూర్య పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్యానర్స్ కట్టేందుకు కరంట్ స్తంభం ఎక్కగా, కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముఖ్యంగా సూర్య అభిమానులు మనలో ఇద్దరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అంటూ ఎంతో బాధపడ్డారు. ఈ విషయం బాగా వైరల్ అవ్వడం తో హీరో సూర్య వరకు చేరింది. వెంటనే ఆయన మృతుల కుటుంబాలకు వీడియో కాల్ చేసి చనిపోయిన వారిని నేను ఎలాగో తీసుకొని రాలేను, మీ కుటుంబం లో మగదిక్కు లేకుండా పోయాడు, మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించి, మీకు కుటుంబానికి ఏ అవసరం వచ్చినా వెంటనే ఆదుకుంటాను అంటూ సూర్య ఈ సందర్భంగా ఆ ఇరువురి కుటుంబాలకు ధైర్యం ఇచ్చాడు.
సూర్య చేసిన ఈ పని కి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులకు ఏ చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేని హృదయం సూర్యది. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు తమిళనాడు లో చేసి ఉన్నాడు. ఎంతో మందికి గుండె ఆపేరేషన్లు చేయించడమే కాకుండా, ఎంతో మంది విద్యార్థులకు ఉచిత విద్యని కూడా అందించాడు. అందుకే ఆయన్ని అందరూ అంతలా అభిమానిస్తూ ఉంటారు. హీరో సూర్య ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తున్నాడు, ఒక సినిమా ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, మరో 4 వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.