Home Cinema Vishwak Sen: స్టేజి పైనే రెచ్చిపోయిన హీరో విశ్వక్ సేన్.. హీరోయిన్ చీరతో..

Vishwak Sen: స్టేజి పైనే రెచ్చిపోయిన హీరో విశ్వక్ సేన్.. హీరోయిన్ చీరతో..

Vishwak Sen Neha Shetty: టాలీవుడ్ లోకి కొంతమంది కుర్ర హీరోలు బాలీవుడ్ కల్చర్ ని తీసుకొస్తున్నారు. ఇది వాళ్ళ సినిమా ప్రొమోషన్స్ ని చేసుకునే కొత్త పద్దతి, అందులో తప్పు లేదు అని అనుకోవచ్చు కానీ, తెలుగు సంప్రదాయాలకు బాగా అలవాటు పడిన మనకి చూసేందుకు అసహ్యంగా అనిపిస్తుంది. రీసెంట్ గా అలాంటి ట్రెండ్ కి ఒడిగట్టాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గానే ఆయన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ కోసం హైదరాబాద్ లో మేకర్స్ ఒక ‘లైవ్ మ్యూజిక్ కన్సర్ట్’ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మరియు సమంత చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

vishwak-sen-romantic-dance-on-stage-with-actress-neha-shetty

ఎక్కడ చూసినా దీని గురించే చర్చ, విజయ్ దేవరకొండ మరియు సమంత ఫ్యాన్స్ తప్ప, వీళ్ళు చేసిన ఈ రొమాంటిక్ బిట్ పై అందరూ తీవ్రమైన నెగటివిటీ చూపిస్తున్నారు. ఇదంతా మాములుగా జరిగి ఉంటే ఎలాంటి గొడవ ఉండేది కాదు. విజయ్ దేవరకొండ స్టేజి మీద చొక్కా విప్పి చెయ్యడం వల్లే ఇంత పెద్ద రచ్చ అయ్యింది. అంతే కాకుండా సమంత లాంటి సూపర్ స్టార్ ఇలా స్టేజి మీద రొమాంటిక్ బిట్స్ చేయడాన్ని కూడా ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. అయితే ఈ ఈవెంట్ జరిగిన మరుసటి రోజు విశ్వక్ సేన్ కూడా తన కొత్త సినిమా హీరోయిన్ నేహా శెట్టి తో కలిసి ఇలాంటి రొమాంటిక్ ఫీట్ రిపీట్ చేసాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వీళ్ళిద్దరూ కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటని రీసెంట్ గానే విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ హీరోయిన్ నేహా శెట్టి తో కలిసి చేసిన రొమాంటిక్ బిట్ కూడా తెగ వైరల్ అయ్యింది(Vishwak Sen Neha Shetty). విజయ్ దేవరకొండ ఏది చేస్తే అలా చేస్తూ తన సినిమాకి పబ్లిసిటీ పెంచుకునే విశ్వక్ సేన్ ఇప్పుడు ఇలా చేసాడు. ఇప్పుడే కాదు, గతం లో కూడా విశ్వక్ సేన్ ఇలాంటి పబ్లిసిటీ స్తంట్స్ చాలానే చేసాడు.

విజయ్ దేవరకొండ చేసేవి జనాలకు అతి అని అనిపిస్తే, విశ్వక్ సేన్ చేసేవి అనావృష్టి అనిపిస్తాది. ఇద్దరికీ ఇద్దరు తమ సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటివి చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు. ఏదిఏమైనా హీరో విశ్వక్ సేన్ ను మెచ్చుకోవాల్సిందే. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, తన సొంత కష్టం, టాలెంట్ తో సినిమాలు చేసి హిట్లు కొడుతూ మంచి అభిమానులనే సంపాదించుకున్నాడు విశ్వక్.

Exit mobile version