Home Uncategorized Vijay Devarakonda : రష్మిక తో పెళ్లి గురించి ఓపెన్ అయిపోయిన విజయ్ దేవరకొండ.. త్వరలోనే...

Vijay Devarakonda : రష్మిక తో పెళ్లి గురించి ఓపెన్ అయిపోయిన విజయ్ దేవరకొండ.. త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ షాకింగ్ కామెంట్స్!

Rashmika : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన రెండు మూడు సినిమాలతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్(Vijay Devarakonda) ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి హీరోలంటే ఎంత క్రష్ ఉండేదో, నేడు విజయ్ దేవరకొండ మీద కూడా అంతే క్రష్ ఉంది.

vijay-devarkonda-open-up-about-his-relationship-with-rashmika-mandanna

సాధారణమైన అమ్మాయిలలో మాత్రమే కాదు. హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతున్నారు. ఇంత క్రేజ్ రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఏ హీరోలో కూడా చూడలేదు. అయితే విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రెండింగ్ టాపిక్ అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి ఆయన ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మండన తో ప్రేమలో ఉన్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వీళ్లిద్దరు కలిసి పార్టీలకు పబ్బులకు వెళ్లడమే కాకుండా, వరల్డ్ టూర్స్ కి కూడా వెళ్లడం వంటివి చెయ్యడం తో అభిమానుల్లో అనుమానాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇద్దరి కెరీర్ పీక్ రేంజ్ లో ఉంది కాబట్టి, కొన్ని రోజులు కెరీర్ ని చూసుకొని, ఆ తర్వాత పెళ్లి(Vijay Devarakonda) చేసుకునే ఉద్దేశ్యం లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ ఈయన హీరోగా నటించిన ‘ఖుషి’ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని మీడియా ప్రతినిధులు అడగగా, విజయ్ దేవరకొండ దానికి సమాధానం చెప్తూ ‘త్వరలోనే పెళ్లి చేసుకుంటాను, మీకు గుడ్ న్యూస్ వినిపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇన్ని రోజులు రష్మిక తో ప్రేమాయణం నడుపుతున్నాడు అనే వార్తలకు ఈ పెళ్లి ద్వారా తెర దించబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఒకవేళ నిజంగానే రష్మిక ని పెళ్లి చేసుకుంటే మాత్రం సౌత్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా మిగిలిపోతారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Exit mobile version