Sreeleela Yash Relation: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండేళ్ల లోపే స్టార్ హీరోయిన్ గా ఎదగడం అంటే సాధారమైన విషయం కాదు. ఎంతో టాలెంట్, అందం తో పాటుగా, బోలెడంత అదృష్టం ఉంటే తప్ప ఆ రేంజ్ కి చేరుకోరు. చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీ లో ఉన్నారు అలాంటి వాళ్ళు. వారిలో ఒకరే శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అవుతూ చేసిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఆ తర్వాత రవితేజ ‘ధమాకా’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.
ఈమె దెబ్బకి అప్పటి వరకు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ గా చాలామణి అయిన పూజా హెగ్డే, రష్మిక మందన వంటి హీరోయిన్స్ డిమాండ్ అమాంతం తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల దగ్గర నుండి, విజయ్ దేవరకొండ, రామ్ వంటి యంగ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది శ్రీలీల. కేవలం వీళ్లకు మాత్రమే కాదు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలకు కూడా ఇప్పుడు శ్రీలీలనే కావాలి. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల కన్నడ సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈమె తల్లి స్వర్ణలత బెంగళూరు లో పెద్ద డాక్టర్. అక్కడ టాప్ 5 గైనకాలజిస్ట్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో స్వర్ణలత గారి పేరు కచ్చితంగా ఉంటుంది. శ్రీలీల కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టేముందు డాక్టర్ చదివింది. ధమాకా సినిమా షూటింగ్ సమయం లో కూడా ఆమె పరీక్షలు రాస్తుండేది అట. ఇదంతా పక్కన పెడితే కేజీయఫ్ సినిమా హీరో రాకింగ్ స్టార్ యాష్ శ్రీలీల కి బావ అవుతాడు అట(Sreeleela Yash Relation). అది సొంత బంధుత్వం అనుకుంటే పెద్ద పొరపాటే. అసలు విషయానికి వస్తే యాష్ భార్య రాధికా పండిట్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరి పిల్లలను ప్రసవం చేసి బయటకి తీసుకొచ్చింది శ్రీలీల తల్లి స్వర్ణలత అట.
అప్పటి నుండి శ్రీలీల కుటుంబం మరియు హీరో యాష్ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారట. ఇక రాధికా పండిట్ ని అక్కా అని, యాష్ ని బావ అని పిలవడం శ్రీలీల కి మొదటి నుండి అలవాటు అట. శ్రీలీల కి యాష్ కి మధ్య ఉన్న సంబంధం ఇదే అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. వీళ్లిద్దరు సరదాగా కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో అని అభిమానులు ఆత్రం గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో డజను సినిమాలు ఉంటే అన్నీ తెలుగు సినిమాలే అవ్వడం విశేషం. కన్నడ సినిమాలకు బాగా దూరం అయిపోయింది ఈ హాట్ బ్యూటీ.