Home Cinema జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్.. మరి ఇలాంటి చిల్లర పనులేంటి..

జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్.. మరి ఇలాంటి చిల్లర పనులేంటి..

yadama-raju-arrest

పటాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు యాదమ్మ రాజు, ఆ తరువాత జబర్దస్త్ షోలో కూడా కనిపించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. తన సొంత కామెడీ స్టైల్ తో తెలుగు లో మరెన్నో టీవీ షోలలో నటించి మంచి కమెడియన్ అని పేరు సంపాదించుకున్నాడు. తనకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో తన కామెడీ స్కిట్లు పెడుతూ ఉంటాడు యాదమ్మ రాజు.

యాదమ్మ రాజు కేవలం బుల్లి తెరకు మాత్రం అంకితం కాకుండా తన అదృష్టాన్ని వెండి తెరపై కూడా పరీక్షించు కున్నాడు. పలు సినిమాలో నటించి అందరి మెప్పులు పొందాడు. తాజాగా యాదమ్మ రాజు తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం లేపుతుంది. యాదమ్మ రాజు అరెస్ట్ అయినా ఫోటోలు థానే స్వయంగా షేర్ చేసి ఎందుకు అరెస్ట్ అయ్యాడో తెలుసు కోవాలి అంటే తన బయోలో ఉన్న లింక్ కొట్టి తెలుస్కోండి అని చెప్పాడు.

ఇక విషయానికి వస్తే యాదమ్మ రాజు ప్రస్తుతం ‘హూ ఐస్ మై డాడీ’ అని ఒక తెలుగు వెబ్ సిరీస్ లో చాల ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఆ సిరీస్ ప్రమోషన్ భాగంగా రిలీజ్ అయిన ట్రైలర్ లింక్ బయోలో పెట్టి అందరూ అది చూడాలి ఇక ఒక చిన్న ఏప్రిల్ ఫూల్ లాంటి ప్రాంక్ చేసాడు. త్వరలో ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది ఈ సిరీస్ దాని ప్రమోషన్ కోసమే ఇలాంటి స్టంట్ చేసాడు యాదమ్మ రాజు.

Exit mobile version