Home Cinema Samantha : అదిరిపోయే అవకాశం కొట్టేసిన సమంత.. తెలుగు సినిమాకు రిఎంట్రీ..

Samantha : అదిరిపోయే అవకాశం కొట్టేసిన సమంత.. తెలుగు సినిమాకు రిఎంట్రీ..

Samantha : నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటినుండి సమంత సినిమాలకు బ్రేక్ తీసుకుంది, ఆరోగ్యం మొత్తం సరిపోయేవరకు సినిమాలు చేయనని చెప్పింది. ప్రస్తుతం సమంత ఆరోగ్యం బాగుంది, మయోసైటిస్ నుండి కోలుకుని మల్లి సినిమాలు చేసేందుకు సిద్ధం అయింది. అమెజాన్ ప్రైమ్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది సమంత.

ఈ సిరీస్ చేసేందుకు సుమారు 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది అట సమంత. ఇటీవల తన సొంత పోడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది సమంత, అందులో ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది. ఎపుడు ఏదో ఒక విషయమా పై చర్చలో నిలుస్తుంది, ప్రస్తుతం ఒక అదిరిపోయే సినిమా ఆఫర్ కొట్టేసింది సమంత అంటూ నెట్టింట ఒక వార్త తెగ షేర్ అవుతుంది. విషయం ఏంటి అంటే సమంత టాలీవుడ్ కి తిరిగి రానుంది. ఇక్కడ ఒక సినిమాలో నటించనుంది.

samantha-allu-arjun-atlee-movie

డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అన్న వార్త మనం ఇంతముందే విన్నాము, పుష్ప 2 పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించనున్నాడు. ఇక సమంత అట్లీ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. అల్లు అర్జున్ సమంత ఇంతకు ముందు కలిసి చేసిన ‘సన్ అఫ్ సత్య మూర్తి’ మంచి విజయాన్ని అందుకుంది, ఇక పుష్ప లో సమంత ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ సమంత కెమిస్ట్రీ కూడా బాగా నడిచింది. ఇక అట్లీ తో చేసే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వటం ఖాయం అంటూ అప్పుడే నిర్ణయించేసారు.

Exit mobile version