Sunday, July 7, 2024
HomeCinemaJagapathi Babu: ప్రభాస్ నిజస్వరూపం బయట పెట్టిన జగపతి బాబు.. అలాంటి వాడు అంటూ కామెంట్స్..

Jagapathi Babu: ప్రభాస్ నిజస్వరూపం బయట పెట్టిన జగపతి బాబు.. అలాంటి వాడు అంటూ కామెంట్స్..

Jagapathi Babu: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఉన్న హీరోలు మన టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉంటారు. కేవలం ఒకటి రెండు హిట్లు రాగానే పెద్ద స్టార్స్ అయిపోయాము అంటూ బిల్డప్స్ ఇచ్చే హీరోలు ఉన్న ఈరోజుల్లో, ఫ్లాప్ సినిమాకి సైతం వందల కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని రాబట్టే స్టామినా ఉన్న ప్రభాస్ లాంటి హీరోకి ఇసుమంత గర్వం కూడా లేకపోవడం ఆశ్చర్యం. ఆయన ఉదార స్వభావం గురించి ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరు చెప్తూనే ఉంటారు, అందరినీ డార్లింగ్ అని పిలుస్తూ ఎంతో స్నేహం గా ఉంటాడు(Jagapathi Babu About Prabhas). ఆయన గొప్పతనం గురించి ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తాడు.

jagapathi-babu

ప్రభాస్ తో ఇంతకుముందు జగపతి బాబు ‘రాధే శ్యామ్’ అనే సినిమా చేసాడు. ఇప్పుడు రీసెంట్ గా ‘సలార్‘ చిత్రం లో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ప్రభాస్ తో తనకి జరిగిన ఒక సంఘటన గురించి జగపతి బాబు చెప్తూ ‘ఒక రోజు నేను తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నాను, ఆ సమయం లో నా బాధని ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు. అలాంటి స్థితిలో ప్రభాస్ కి ఫోన్ చేశాను, చాలా సేపు మాట్లాడాను, డార్లింగ్ నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా, నాకు చెప్పుకో సాల్వ్ చేస్తాను అని అన్నాడు(Jagapathi Babu About Prabhas). ఆ టైం లో ప్రభాస్ జార్జియా లో ఎదో సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

prabhas

ఇండియా కి తిరిగి వచ్చాక నన్ను కలిసాడు, నాకు ఉన్న సమస్య ని పరిష్కరించి నాపై ఉన్న భారాన్ని దించేసాడు. ప్రభాస్ ఎప్పుడూ అంతే, సహాయం కోరి తన వద్దకి వెళ్తే ఖాళీ చేతులతో మాత్రం పంపడు, అది అతనిలో ఉన్న గొప్ప గుణం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే జగపతి బాబు రాజమౌళి కి బంధువు అవుతాడని మన అందరికీ తెలిసిందే, కానీ ఏనాడూ కూడా నాకు నీ సినిమాలో ఒక అవకాశం ఇవ్వమని నేను రాజమౌళి ని అడగలేదు. అలాగే రాజమౌళి కూడా ఎప్పుడూ నాకోసం పాత్ర రాయలేదు. ఆయన కథకి ఎవరు యాప్ట్ అనుకుంటే వాళ్లనే తీసుకుంటాడు అని చెప్పుకొచ్చాడు జగపతి బాబు.

jagapathi-babu-about-prabhas

ప్రస్తుతం జగపతి బాబు సలార్ చిత్రం తో పాటుగా గుంటూరు కారం, పుష్ప పార్ట్ 2 వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. సాలార్ అసలైతే ఈ నెల 28న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆపేసారు. ఫాన్స్ ఈ వార్త విని సినిమా బృందం పై ఫుల్ గా మండి పడుతున్నారు. సినిమా ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. దీనితో ఫాన్స్ ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

మొత్తానికి ఈ రచ్చ అంతా చూసి ప్రభాస్ పుట్టిన రోజు నాడు 23 అక్టోబర్ న సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాము అని అధికారిక ప్రకటన విడుదల చేశారు. సినిమా మాత్రం ఎపుడు రిలీజ్ అని ఇంకా ఎటువంతి సమాచారం లేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts