Home Cinema Jr. NTR : Jr ఎన్టీఆర్ దేవర డైలాగ్ లీక్.. రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి..

Jr. NTR : Jr ఎన్టీఆర్ దేవర డైలాగ్ లీక్.. రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి..

Jr. NTR : ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్బస్టర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నా ఈ చిత్రం రెండు భాగాలుగా మన ముందుకుతీసుకొస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా మొదటి గ్లిమ్ప్స్ విడుదల చేసిన్నప్పటి నుండి మంచి హైప్ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబందించిన ఒక్క అప్డేట్ కూడా విడుదల చేయలేదు చిత్ర యూనిట్.

నందమూరి అభిమానులుయె దేవర అప్డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ చాలారోజుల తరువాత అభిమానుల ముందుకు వచ్చారు. ఆయన టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కు హాజరై తన స్టైల్లో నవ్వులు కురిపించారు. సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా తక్కువ సమయంలోనే 100 కోట్ల సంపాదించడం నాకు చాల ఆనందాన్ని కలిగించింది. సిద్దు నాకు కరోనా సమయం నుండి తెలుసు.

jr-ntr-devara-dialogue-leak

అతనికి సినిమా అంటే ఎంత ఫ్యాషనో చూస్తే ముచ్చటేస్తుంది. తాను ఇలానే వరుస విజయాలతో దూసుకుపోవాలని ఎన్టీఆర్ అన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ తన స్పీచ్ లో భాగంగా కొన్ని డైలాగ్లు విసిరాడు. ఆ డైలాగ్లు దేవర సినెమాలోనివే అంటూ ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే మనం దేవర విడుదల దాకా వేయిచ్చిచూడాలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా బారి విజయం అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Exit mobile version