ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఎన్టీఆర్. నటనలోనూ డాన్స్ లోను ఎన్టీఆర్ కి ఎవ్వరు సాటి రాలేరు అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి వెల్లడైన పలు వార్తలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా స్వప్న లోక సుందరి అయిన శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండటం విశేషం. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్న ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసారు. 2-3 రోజుల క్రితం హీరో సిద్దు, విశ్వక్ సేన్ ని ఇంటికి పిలిచి మరి పార్టీ ఇచ్చాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆ సక్సెస్ మీట్ లో ధరించిన వాచ్ గురించే అందరి చర్చ. ఇంతకీ ఏ వాచ్ అది, దాని ధర ఎంత.?
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ రేటెంతో తెలుసుకునే పనిలో ఉన్న అభిమానులు. ఎంతో కష్టపడి అది ఏ కంపెనీ వాచ్ దాని ధర ఎంతో కనిపెట్టేసారు నెటిజనులు. ఆ వాచ్ తయారు చేసిన కంపెనీ పేరు Audemars Piguet ఇక మోడల్ పేరు రాయల్ ఓక్ ఆఫ్‌షోర్. ఇక ఆ వాచ్ ధర అక్షరాలా 1,62,32,000. ఈ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.