Wednesday, September 18, 2024
HomeCinemaBig Boss : ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్...

Big Boss : ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్న హాట్ బ్యూటీ..

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ప్రారంభ ఎపిసోడ్ నుండే ఎంత రసవత్తరంగా మొదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి ఎపిసోడ్ లోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టేసాడు. నాగ మణికంఠ మీద ప్రాంక్ చేసి అతనిపై కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసేలా చేసాడు. ఒకవిధంగా చెప్పాలంటే నాగ మణికంఠ గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచేసాడు. ఇతను మరో పల్లవి ప్రశాంత్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి(Big Boss Wild card). అయితే టాస్కుల విషయం లో నాగ మణికంఠ బాగా వీక్ గా ఉన్నాడు అని అనిపిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో ట్విస్టులకు, షాకులకు కొదవే ఉండదు, ఏదైనా అన్ లిమిటెడ్ అని నాగార్జున మొదటి ఎపిసోడ్ లోనే చెప్పుకొచ్చాడు. సాధారణంగా వైల్డ్ కార్డు ఎంట్రీలు నాలుగు వారాల తర్వాత , లేదా 5 వారాల తర్వాత ఉంటుంది. గత సీజన్ లో 5 వ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ద్వారా కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. కానీ ఈ సీజన్ లో పూర్తి బిన్నంగా మొదటి వారంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక హాట్ బ్యూటీ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు(Big Boss Wild card). ఆమె మరెవరో కాదు జ్యోతి రాయ్. ఈమె స్టార్ మా ఛానల్ లో బంపర్ హిట్ గా నిల్చిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఈ సీరియల్ లో ఆమె తల్లి పాత్ర పోషించింది. అతి చిన్న వయస్సు అయినప్పటికీ కూడా తల్లి పాత్రలో ఈమె ఒదిగిపోయి నటించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తల్లి పాత్రలో కనిపించిన ఆమె నిజస్వరూపం ఇంస్టాగ్రామ్ లో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. హాట్ ఫొటోలతో కుర్రకారులు పిచ్చెక్కిపోయేలా కనిపించే ఆమె అందానికి ముగ్దులు కానీ మగవాడు అంటూ ఎవరు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి హాట్ బ్యూటీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మన ముందుకు రాబోతుంది.

సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించింది. సుక్కు అనే ప్రముఖ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఈమె, అతను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా ద్వారా కుర్రకారులో మంటలు రేకెత్తించిన ఈమె, బిగ్ బాస్ షో లో ఎలా అదరగొట్టబోతుందో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts