Kajal Agarwal : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె ఈ స్థాయికి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. తెలుగు , తమిళ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయిక గా ఎదిగిన కాజల్ అగర్వాల్(Kajal Agarwal as Villain), రీసెంట్ గానే గౌతమ్ అనే అతన్ని పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఒక బాబు కి జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళం లో ఒక సినిమా చేసింది కానీ, అది పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇక తెలుగు లో ఆమె బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ నెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే కాజల్ అగర్వాల్ ని ఇన్ని రోజులు మనం క్యూట్ మరియు బాబ్లీ రోల్స్ లోనే చూస్తూ వచ్చాము. నెగటివ్ టైపు క్యారక్టర్ లో ఎప్పుడూ చూడలేదు.
‘సీత’ చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించింది కానీ, అది పూర్తి స్థాయి నెగటివ్ రోల్ మాత్రం కాదు. కానీ ఇప్పుడు కరుడు గట్టిన విలన్ గా నటించేందుకు ఆమె సిద్ధం అయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి #RRR చిత్రం తర్వాత మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇందులో ఒక లేడీ విలన్ పాత్ర ఉంటుందట. సినిమాకి అత్యంత కీలకమైన పాత్ర ఇది.
ఈ క్యారక్టర్ కోసం ముందుగా ఐశ్వర్య రాయి ని అడగగా ఆమె నో చెప్పింది. దీంతో ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ని అడగగా, ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. కాజల్ అగర్వాల్ ఎప్పటి నుండో పూర్తి స్థాయి విలన్ రోల్స్ లో నటించాలని ఉంది అంటూ చాలా సార్లు చెప్పింది. ఆమె కోరిక ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ద్వారా తీరబోతుంది.
గతం లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన కాజల్(Kajal Agarwal as Villain) అగర్వాల్, ఇప్పుడు అదే రాజమౌళి సినిమాలో విలన్ గా నటించబోతుండడం విశేషం. ఈ పాత్ర ఆమె కెరీర్ ని ఎలా మలుపు తిప్పబోతుందో చూడాలి.