Friday, November 22, 2024
HomeCinemaKajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోలపై ఘోరమైన కామెంట్స్ చేసిన కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోలపై ఘోరమైన కామెంట్స్ చేసిన కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. కాజల్ తెలుగు ఆడియన్స్ ను తన అందం మరియు నటనతో మంత్రముగ్దులను చేసింది. ఈమె స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది. కాజల్ ఇటీవల ముంబై వాసి అయినా ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. ఒక మొగ బిడ్డకు జన్మనించింది. ఇలా ఆమె నటన నుండి బ్రేక్ తీసుకుంది. ఆ త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ ను మొదలుపెట్టింది.

కాజల్ అగర్వాల్ కొడుకు పుట్టిన తర్వాత సినిమాలో నటించడానికి సిద్ధమైంది మరియు ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈ భామకు ఇటీవల స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడంలేదు అనే చెప్పాలి. ఆమె తాజాగా నటించిన చిత్రం సత్య భామ. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో కాజల్ అగర్వాల్ చురుగ్గా పాల్గొంటోంది. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీని పొగిడి టాలీవుడ్ ఇండస్ట్రీని కించపరిచింది. ఇది ఆమెను వార్తలో నిలిచేలా చేసాయి.

kajal-sensational-comments-on-tollywood-star-heros
ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా మంచి పాత్రలలో నటిస్తుంటారు. కానీ టాలీవుడ్‌లో అలా జరగడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డా పెళ్లయ్యాక హీరోయిన్ గా ఎదగలేరు. ఎందుకు టాలీవుడ్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వరు అని అడిగింది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అని కాజల్ అగర్వాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. దీనితో కాజల్ ఇప్పుడు చిక్కుల్లో పడింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts