Home Cinema Kalyan Ram : మొదటిసారి కళ్యాణ్ రామ్ విలన్ పాత్రలలో నటించబోతున్నాడు.. ఫాన్స్ కు పూనకాలే..

Kalyan Ram : మొదటిసారి కళ్యాణ్ రామ్ విలన్ పాత్రలలో నటించబోతున్నాడు.. ఫాన్స్ కు పూనకాలే..

Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అందరికి సుపరిచితుడే. టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో సంవత్సరాలుగా సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నందమూరి వంశం నుండి వచ్చిన బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ కాలేకపోయాడు కానీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కళ్యాణ్ రామ్ కూడా పెద్ద సినిమాల్లో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. ఈయన ఇటీవల బింబిసారా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు అందరు ఆశ్చర్యపోయారు. తనలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అంటూ పొగిడేశారు. బింబిసారా సినిమాలో నెగటివ్ రోల్ చేసినప్పటి నుండి, కళ్యాణ్ రామ్ కు స్టార్ డైరెక్టర్స్ ఈయనకు నెగెటివ్ పాత్రలు పోషించే ఆఫర్లను ఇస్తున్నారట. కానీ అతను తిరస్కరిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కు ఓ స్టార్ డైరెక్టర్ భారీ ఆఫర్ ఇచ్చాడట. ఈ ఆఫర్ కు కళ్యాణ్ రామ్ ఫిదా అయ్యాడట. అందుకే నెగిటివ్ రోల్ చేయడానికి ఒప్పేసుకున్నాడట.

kalyan-ram-acting-as-villain-for-the-first-time

ఈ హీరో మరెవరో కాదు ప్రభాస్. సందీప్ రెడ్డి వాంగ హీరోలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో విలన్ లకు కూడా అంతే ఇస్తాడు. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ విలన్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సందీప్ రెడ్డి ఫాన్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version