Home Cinema Varalakshmi : నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..

Varalakshmi : నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..

Varalakshmi : సౌత్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ అందరికి సుపరిచితురాలు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ యంగ్ ఏజిలోనే నెగిటివ్‌ పాత్రలతో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ బాడీ లాంగ్వేజ్ విలన్ లా ఉండటంతో ఆమెకు హీరోయిన్ పాత్రలు ఇవ్వలేదు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా చాలా ట్రోల్‌లకు గురయ్యారు వరలక్ష్మి.

అందుకే విలన్ పాత్రలు చేసుకుంటూ తన సత్తా చాటుకుంటుంది. అయితే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం మన అందరికి తెలిసిందే. ఆమె తన ఎంగేజ్మెంట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తన బాయ్ ఫ్రెండ్ అయినా నికోలాయ్ తో పెళ్లి తొందర్లోనే అంటూ అప్పట్లో తానె స్వయంగా చెప్పింది. అయితే నీకొలాయ్ కు ముందు ఒకరితో వివాహం అయింది మరియు పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు.

varalakshmi-sharath-kumar-marriage-date-place-fixed

అయితే ఈ ఏడాదే తమ పెళ్లి జరుగుతుందని చాలా సార్లు చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన పెళ్లికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కోసం తన అభిమానులు ఎదురుచ్హూస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, నికోలాయ్ సచ్ దేవ్ ల వివాహం జూలై 2న జరగనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికితోడు వీరి పెళ్లి మన దేశంలో కాకుండా విదేశాల్లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ వివాహాన్ని థాయ్‌లాండ్‌లో ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version